‘యోనో’పై ఎలాంటి రుణాలు ఇవ్వడంలేదు : ఎస్‌బీఐ

ABN , First Publish Date - 2020-05-11T06:40:46+05:30 IST

తమ బ్యాంకుకు చెందిన డిజిటల్‌ సేవా విభాగం యోనోపై అత్యవసర రుణాలేవీ అందించడంలేదని ఎస్‌బీఐ ప్రకటించింది. కొన్ని ప్రభుత్వ బ్యాంకులు ‘45 నిమిషాల’ వ్యవధిలోనే రూ.5 లక్షల వరకు అత్యవసర రుణాలు...

‘యోనో’పై ఎలాంటి రుణాలు ఇవ్వడంలేదు : ఎస్‌బీఐ

న్యూఢిల్లీ: తమ బ్యాంకుకు చెందిన డిజిటల్‌ సేవా విభాగం యోనోపై అత్యవసర రుణాలేవీ అందించడంలేదని ఎస్‌బీఐ ప్రకటించింది. కొన్ని ప్రభుత్వ బ్యాంకులు ‘45 నిమిషాల’ వ్యవధిలోనే రూ.5 లక్షల వరకు అత్యవసర రుణాలు 10.5 శాతం వార్షిక వడ్డీ రేటుకు అందిస్తున్నాయనీ, యోనో వేదిక ద్వారా ఎస్‌బీఐ కూడా అలాంటి రుణ సదుపాయం కల్పించిందని వచ్చిన వార్తలను ఖండించింది. అయితే కోవిడ్‌-19 కారణంగా నగదు ఇబ్బంది ఎదుర్కొంటున్న కస్టమర్ల కోసం యోనో ద్వారా ప్రీ అప్రూవ్డ్‌ పర్సనల్‌ లోన్‌ ప్రవేశపెట్టే ప్రయత్నంలో ఉన్నట్టు ఎస్‌బీఐ తెలియచేసింది. 


Updated Date - 2020-05-11T06:40:46+05:30 IST