నీరవ్ మోదీ రిమాండ్ పొడిగింపు.. వచ్చే ఏడాది ఫైనల్ హియరింగ్

ABN , First Publish Date - 2020-12-02T01:57:49+05:30 IST

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)ను 2 బిలియన్ డాలర్ల మేర మోసం చేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ మరికొంత కాలం లండన్ జైలులో

నీరవ్ మోదీ రిమాండ్ పొడిగింపు.. వచ్చే ఏడాది ఫైనల్ హియరింగ్

లండన్: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)ను 2 బిలియన్ డాలర్ల మేర మోసం చేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ మరికొంత కాలం లండన్ జైలులో గడపక తప్పదు. అతడి రిమాండ్‌ను లండన్ కోర్టు మరికొంత కాలం పొడిగించింది. భారత్‌కు మోస్ట్ వాంటెడ్ అయిన నీరవ్ మోదీని తమకు అప్పగించాలంటూ భారత్ చేసిన అభ్యర్థనపై లండన్ కోర్టులో విచారణ జరగ్గా 49 ఏళ్ల నీరవ్ మోదీ వీడియో లింక్ ద్వారా తానుంటున్న వండ్స్‌వర్త్ జైలు నుంచి వీడియో లింక్ ద్వారా హాజరయ్యాడు. 28 రోజుల ‘కాల్ ఓవర్ హియరింగ్’లో భాగంగా వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు చీఫ్ మేజిస్ట్రేట్ ఎమ్మా అర్బుథ్‌నాట్.. నీరవ్ మోదీ రిమాండ్‌ను మరో 28 రోజులు అంటే ఈ నెల 29 వరకు పొడిగించారు. దీంతో భారత్ అభ్యర్థనపై తుది విచారణ వచ్చే ఏడాది జనవరి 7, 8 తేదీలలో ఉండే అవకాశం ఉంది.  

Updated Date - 2020-12-02T01:57:49+05:30 IST