11250 పైన మరింత అప్‌ట్రెండ్
ABN , First Publish Date - 2020-07-27T08:58:59+05:30 IST
నిఫ్టీ గత వారం 11250 వద్ద మైనర్ రియాక్షన్ సాధించినా ప్రధాన మద్దతు స్థాయి 11000 వద్ద నిలదొక్కుకుని చివరికి 300 పాయింట్ల

నిఫ్టీ గత వారం 11250 వద్ద మైనర్ రియాక్షన్ సాధించినా ప్రధాన మద్దతు స్థాయి 11000 వద్ద నిలదొక్కుకుని చివరికి 300 పాయింట్ల లాభంతో వారం గరిష్ఠ స్థాయిలో క్లోజైంది. ఏడు వారాలుగా నిరంతర అప్‌ట్రెండ్‌లో 1500 పాయింట్ల వరకు లాభపడినందు వల్ల సాధారణంగా కరెక్షన్ రావాల్సి ఉంది లేదా కన్సాలిడేషన్ ఏర్పడాలి. ఓవర్‌బాట్ స్థితి కూడా కొనసాగుతోంది. స్వల్పకాలిక ట్రేడర్లు గరిష్ఠ స్థాయిల్లో స్వల్పకాలిక పొజిషన్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి కరెక్షన్ లేకుండా వరుసగా నిరోధాలన్నింటినీ గత కొద్ది వారాలుగా ఛేదించుకుంటూ రావడం వల్ల కూడా పెద్ద కరెక్షన్ ఏర్పడవచ్చు.
బుల్లిష్ స్థాయిలు: ఇప్పుడు నిఫ్టీ ప్రధాన నిరోధం 11250 వద్ద పరీక్ష ఎదుర్కొనబోతోంది. ఆ పైన నిలదొక్కుకున్నప్పుడే మరింత అప్‌ట్రెండ్ ఉంటుంది. మరో ప్రధాన నిరోధం 11500.
బేరిష్ స్థాయిలు: 11250 వద్ద నిలదొక్కుకోలేకపోతే కరెక్షన్ ముప్పు ఎదుర్కొంటుంది. ప్రధాన మద్దతు స్థాయి 11000. అప్‌ట్రెండ్ నిలబెట్టుకోవాలంటే ఇక్కడ రికవరీ సాధించి బలంగా నిలదొక్కుకోవాలి. అంతకన్నా దిగజారితే మాత్రం స్వల్పకాలిక కరెక్షన్ తప్పదు. ప్రధాన మద్దతు స్థాయిలు 10700, 10500.
బ్యాంక్ నిఫ్టీ: ప్రధాన నిరోధం 23000 కన్నా పైన కనీసం రెండు రోజులు నిలదొక్కుకుంటే స్వల్పకాలిక అప్‌ట్రెండ్ మరింతగా కొనసాగుతుంది. మరో ప్రధాన నిరోధం 23600.
పాటర్న్: 11250 వద్ద ‘‘ఏటవాలుగా ఎగువకు ఏర్పడిన రెసిస్టెన్స్ ట్రెండ్‌లైన్’’ వద్ద నిరోధం ఎదురవుతోంది. స్వల్పకాలిక అప్‌ట్రెండ్ కోసం ఈ అవరోధాన్ని ఛేదించాలి. 11000 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన సపోర్ట్ ట్రెండ్‌లైన్’’ వద్ద గట్టి మద్దతు ఉంది. అంతకన్నా దిగజారితే స్వల్పకాలిక కరెక్షన్ తప్పదు.
టైమ్: ఈ సూచీ ప్రకారం వచ్చే బుధవారం మైనర్ రివర్సల్ ఉంది.
సోమవారం స్థాయిలు
నిరోధం : 11260, 11320
మద్దతు : 11120, 11080
వి. సుందర్ రాజా