గరిష్ఠ స్థాయిల్లో అప్రమత్తం -టెక్ వ్యూ
ABN , First Publish Date - 2020-06-22T05:52:45+05:30 IST
నిఫ్టీ గత వారం కరెక్షన్‌లో ప్రారంభమైనా 9700 వద్ద రికవరీ సాధించి వారం మొత్తం మీద 270 పాయింట్ల లాభంతో పటిష్ఠంగా ముగిసింది. కాని నిరోధ స్థాయి 10300 కన్నా దిగువనే ఉంది...

నిఫ్టీ గత వారం కరెక్షన్‌లో ప్రారంభమైనా 9700 వద్ద రికవరీ సాధించి వారం మొత్తం మీద 270 పాయింట్ల లాభంతో పటిష్ఠంగా ముగిసింది. కాని నిరోధ స్థాయి 10300 కన్నా దిగువనే ఉంది. ఇండెక్స్ ప్రస్తుతం కీలక నిరోధ స్థాయిలకు సమీపంలో ఉన్నందు వల్ల స్వల్పకాలిక ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలి. మార్చి నుంచి గత మూడు నెలలుగా స్వల్పకాలిక అప్‌ట్రెండ్ కొనసాగుతోంది. 2800 పాయింట్లకు పైగా లాభపడింది. ఇప్పుడు 10700 వద్ద గట్టి నిరోధం ఎదురవుతోంది. 20, 50 డిఎంఏల కన్నా పైనే ఉన్నప్పటికీ 100 డిఎంఏ వద్ద పరీక్ష ఎదురవుతోంది.
బుల్లిష్ స్థాయిలు: రియాక్షన్‌లో పడినా ట్రెండ్‌లో సానుకూలత కోసం 10000 వద్ద బలమైన పునరుజ్జీవం తప్పనిసరి. ప్రధాన నిరోధం 10300. ఆ పైన కోలుకుంటే స్వల్పకాలిక అప్‌ట్రెండ్ మరింతగా కొనసాగుతుంది. మరో ప్రధాన నిరోధం 10700.
బేరిష్ స్థాయిలు: 10000 వద్ద విఫలమై అంతకన్నా దిగువన క్లోజయితే స్వల్పకాలిక కరెక్షన్‌లో పడుతుంది. స్వల్పకాలిక ట్రేడర్లు అప్రమత్తంగా ఉండాలి. ప్రధాన మద్దతు స్థాయిలు 9700, 9500.
బ్యాంక్ నిఫ్టీ : ఈ సూచీకి 22000 వద్ద ప్రధాన నిరోధం ఉంది. స్వల్పకాలిక అప్‌ట్రెండ్‌లో ప్రవేశించాలంటే దీన్ని ఛేదించాల్సి ఉంటుంది.
పాటర్న్: స్వల్పకాలిక అప్‌ట్రెండ్ మరింతగా కొనసాగించాలంటే 10300 వద్ద ‘‘అడ్డంగా కనిపిస్తున్న రెసిస్టెన్స్ ట్రెండ్‌లైన్’’ను బ్రేక్ చేయాలి. 10000 వద్ద ‘‘అడ్డంగా కనిపిస్తున్న సపోర్ట్ ట్రెండ్‌లైన్’’ దిగువకు బ్రేక్‌డౌన్ అయితే స్వల్పకాలిక బలహీనత ఏర్పడుతుంది. ప్రస్తుతం మార్కెట్ ‘‘ఏటవాలుగా ఎగువకు కనిపిస్తున్న సపోర్ట్ ట్రెండ్‌లైన్’’ కన్నా చాలా పైన ఉంది.
టైమ్: ఈ సూచీ ప్రకారం సోమ, బుధ వారాల్లో తదుపరి రివర్సల్స్ ఉన్నాయి.
సోమవారం స్థాయిలు
నిరోధం : 10230, 10300
మద్దతు : 10150, 10000