నిరోధ స్థాయిలు 13300, 13500 -టెక్ వ్యూ
ABN , First Publish Date - 2020-12-07T06:20:55+05:30 IST
నిఫ్టీ గత వారం పాజిటివ్‌గానే ప్రారంభమై అప్‌ట్రెండ్‌ను కొనసాగిస్తూ చివరికి 300 పాయింట్ల లాభంతో వారం గరిష్ఠ స్థాయిలో 13260 వద్ద ముగిసింది. టెక్నికల్‌గా నిఫ్టీ ఐదు వారాల అప్‌ట్రెండ్‌లో 1600 పాయింట్ల మేరకు లాభపడింది. నెలవారీ చార్టుల్లో కూడా గతంలో ఏర్పడిన టాప్‌ను ఛేదించి చారిత్రక గరిష్ఠ స్థాయిల్లో 12400 వద్ద ముగిసింది...

నిఫ్టీ గత వారం పాజిటివ్‌గానే ప్రారంభమై అప్‌ట్రెండ్‌ను కొనసాగిస్తూ చివరికి 300 పాయింట్ల లాభంతో వారం గరిష్ఠ స్థాయిలో 13260 వద్ద ముగిసింది. టెక్నికల్‌గా నిఫ్టీ ఐదు వారాల అప్‌ట్రెండ్‌లో 1600 పాయింట్ల మేరకు లాభపడింది. నెలవారీ చార్టుల్లో కూడా గతంలో ఏర్పడిన టాప్‌ను ఛేదించి చారిత్రక గరిష్ఠ స్థాయిల్లో 12400 వద్ద ముగిసింది. ఇది సానుకూల సంకేతం. ఆర్‌ఎ్‌సఐ సూచీల ప్రకారం ఓవర్‌బాట్ స్థితి నెలకొన్నందు వల్ల గరిష్ఠ స్థాయిల్లో షార్ట్ పొజిషన్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. తదుపరి మానసిక అవరోధాలు 13300, 13500. ఈ స్థాయిల్లో కన్సాలిడేట్ కావచ్చు.
బుల్లిష్ స్థాయిలు: మరింత అప్‌ట్రెండ్ కోసం 13300 కన్నా పైన నిలదొక్కుకోవాలి. మరో మానసిక అవధి 13500.
బేరిష్ స్థాయిలు: మద్దతు స్థాయి 13200 కన్నా దిగజారితే మైనర్ కరెక్షన్‌లో పడుతుంది. ప్రధాన స్వల్పకాలిక మద్దతు 13000. అంతకన్నా దిగువన ముగిస్తే స్వల్పకాలిక బలహీనతలో పడుతుంది.
బ్యాంక్ నిఫ్టీ: రెండు వారాల పాటు 30000 వద్ద కన్సాలిడేషన్ అనంతరం దాన్ని బ్రేక్ చేయడం సానుకూల సంకేతం. ఐదు వారాల కాలంలో ఈ సూచీ 6000 పాయింట్ల ర్యాలీ సాధించింది. మరింత అప్‌ట్రెండ్ కోసం ప్రధాన నిరోధం 30200 కన్నా పైన నిలదొక్కుకోవాలి. మరో ప్రధాన నిరోధం 30600. ప్రధాన మద్దతు స్థాయి 29800 కన్నా దిగజారితే స్వల్పకాలిక బలహీనతలో పడుతుంది. ప్రధాన మద్దతు స్థాయిలు 29400, 29000.
ప్యాటర్న్:13300 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన రెసిస్టెన్స్ ట్రెండ్‌లైన్’’ వద్ద గట్టి నిరోధం, 13000 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడి సపోర్ట్ ట్రెండ్‌లైన్’’ వద్ద మద్దతు ఉన్నాయి. సపోర్ట్ ట్రెండ్‌లైన్ కన్నా దిగజారితే స్వల్పకాలిక బలహీనతలో పడుతుంది. 50 డిఎంఏ కన్నా చాలా పైనే ఉండడం ప్రధాన ట్రెండ్ ఎగువకే ఉన్నదనేందుకు సంకేతం.
టైమ్: ఈ సూచీ ప్రకారం సోమవారం తదుపరి రివర్సల్ ఉంది.
సోమవారం స్థాయిలు
నిరోధం : 13310, 13360
మద్దతు : 13200, 13120