ప్రధాన నిరోధం 14000 -టెక్‌ వ్యూ

ABN , First Publish Date - 2020-12-28T06:43:36+05:30 IST

నిఫ్టీ గత వారం బలమైన కరెక్షన్‌లో ప్రారంభమైనా ప్రధాన మానసిక అవధి 13000 కన్నా పైనే కోలుకుని చివరి మూడు రోజుల్లో బలమైన రికవరీ సాధించింది. టెక్నికల్‌గా ప్రధాన ట్రెండ్‌లో మార్పేమీ లేదు...

ప్రధాన నిరోధం 14000  -టెక్‌ వ్యూ

నిఫ్టీ గత వారం బలమైన కరెక్షన్‌లో ప్రారంభమైనా ప్రధాన మానసిక అవధి 13000 కన్నా పైనే కోలుకుని చివరి మూడు రోజుల్లో బలమైన రికవరీ సాధించింది. టెక్నికల్‌గా ప్రధాన ట్రెండ్‌లో మార్పేమీ లేదు. మరోసారి గత వారం సాధించిన గరిష్ఠ స్థాయి 13800 వద్ద పరీక్షకు సమాయత్తం అవుతోంది. ప్రస్తుత ర్యాలీకి అక్కడే బలమైన నిరోధం ఉంది. మార్కెట్‌ ఇప్పటికీ ఓవర్‌బాట్‌ స్థితిలోనే ఉన్నందు వల్ల ప్రస్తుత గరిష్ఠ స్థాయిల్లో స్వల్పకాలిక ట్రేడర్లు అప్రమత్తంగా ఉండాలి. ప్రధాన నిరోధ స్థాయిలు 13800, 14000. 


బుల్లిష్‌ స్థాయిలు: పాజిటివ్‌ ట్రెండ్‌లో కొనసాగితే మరింత అప్‌ట్రెండ్‌ కోసం 13800 కన్నా పైన నిలదొక్కుకోవాలి. ప్రధాన నిరోధం 14000. ఇక్కడ స్వల్పకాలిక కన్సాలిడేషన్‌ ఉండవచ్చు. ఆ పైన స్వల్పకాలిక అప్‌ట్రెండ్‌లో ప్రవేశించి మరింత గరిష్ఠ స్థాయిలకు పురోగమిస్తుంది. 

బేరిష్‌ స్థాయిలు: ప్రధాన మద్దతు స్థాయి 13500 వద్ద విఫలమైతే కరెక్షన్‌లో ప్రవేశిస్తుంది. ప్రధాన స్వల్పకాలిక మద్దతు స్థాయి 13000.

బ్యాంక్‌ నిఫ్టీ: ఈ సూచీ ప్రారంభంలో 1700 పాయింట్ల మేరకు కరక్షన్‌ సాధించినా బలమైన రికవరీ సాధించింది. అయినా 310 పాయింట్ల నష్టంతో 30000 కన్నా స్వల్పంగా పైన క్లోజయింది. ప్రధాన నిరోధ స్థాయిలు 30600, 31000. ఆ పైన మాత్రమే స్వల్పకాలిక అప్‌ట్రెండ్‌ కొనసాగుతుంది. ప్రధాన మద్దతు స్థాయి 30000 కన్నా దిగజారితే స్వల్పకాలిక బలహీనత కొనసాగుతుంది.

పాటర్న్‌: నిఫ్టీకి ప్రస్తుతం 13800 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన రెసిస్టెన్స్‌ ట్రెండ్‌లైన్‌’’ వద్ద గట్టి నిరోధం ఎదురవుతోంది. మరింత అప్‌ట్రెండ్‌ కోసం అంతకన్నా పైన నిలదొక్కుకోవాలి. 13000 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన సపోర్ట్‌ ట్రెండ్‌లైన్‌’’ వద్ద గట్టి మద్దతు ఉంది. అంతకన్నా దిగజారితే స్వల్పకాలిక కరెక్షన్‌లో పడుతుంది.

టైమ్‌: ఈ సూచీ ప్రకారం వచ్చే మంగళవారం తదుపరి రివర్సల్‌ ఉండవచ్చు.


సోమవారం స్థాయిలు

నిరోధం : 13810, 13860 

మద్దతు : 13670, 13600


-వి. సుందర్‌ రాజా

Updated Date - 2020-12-28T06:43:36+05:30 IST