166% పెరిగిన న్యూలాండ్ లాభం
ABN , First Publish Date - 2020-08-05T06:35:27+05:30 IST
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి న్యూలాండ్ లేబొరేటరీస్ ఏకీకృత ప్రాతిపదికన రూ.15.16 కోట్ల నికర లాభాన్ని
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి న్యూలాండ్ లేబొరేటరీస్ ఏకీకృత ప్రాతిపదికన రూ.15.16 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.5.7 కోట్లతో పోలిస్తే 166 శాతం పెరిగినట్లు వెల్లడించింది. ఇదే కాలానికి ఆదాయం రూ.206.12 కోట్లకు చేరింది.