మార్కెట్లోకి కొత్త వెర్నా
ABN , First Publish Date - 2020-05-22T07:03:49+05:30 IST
మార్కెట్లోకి కొత్త వెర్నా కారును హ్యుండాయ్ ఇండియా విడుదల చేసింది. మధ్య స్థాయి సెడాన్ విభాగంలో ఇదే దేశంలో తొలి పూర్తి స్థాయి ‘కనెక్టెడ్’ కారని కంపెనీ తెలిపింది. ద స్పిరిటెడ్ న్యూ వెర్నా కారులో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినె్స): మార్కెట్లోకి కొత్త వెర్నా కారును హ్యుండాయ్ ఇండియా విడుదల చేసింది. మధ్య స్థాయి సెడాన్ విభాగంలో ఇదే దేశంలో తొలి పూర్తి స్థాయి ‘కనెక్టెడ్’ కారని కంపెనీ తెలిపింది. ద స్పిరిటెడ్ న్యూ వెర్నా కారులో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, టెలిమ్యాటిక్స్, ఇంటెలిజెంట్ టెక్నాలజీ వంటి అనేక సదుపాయాలు ఉన్నాయి. కొత్త తరం కారు కొనుగోలుదారులు మెచ్చే వివిధ రకాల సదుపాయాలు ఇందులో ఉన్నాయని హ్యుండాయ్ మోటార్ ఇండియా ఎండీ, సీఈఓ ఎస్ ఎస్ కిమ్ తెలిపారు.