చెక్కు చెల్లింపుల్లో కొత్త విధానం... రేపటినుంచే...

ABN , First Publish Date - 2020-12-17T19:34:47+05:30 IST

చెక్కు చెల్లింపులకు సంబంధించి రూపుదిద్దుకున్న కొత్త నిబంధనలు శుక్రవారం(డిసెంబరు 18) నుంచే అమల్లోకి రానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా... పాజిటివ్ పే సిస్టంను తీసుకువచ్చేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇది... జనవరి 1 నుండి అమల్లోకి వస్తోంది.

చెక్కు చెల్లింపుల్లో కొత్త విధానం... రేపటినుంచే...

న్యూఢిల్లీ : చెక్కు చెల్లింపులకు సంబంధించి రూపుదిద్దుకున్న కొత్త నిబంధనలు శుక్రవారం(డిసెంబరు 18) నుంచే అమల్లోకి రానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా... పాజిటివ్ పే సిస్టంను తీసుకువచ్చేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే.  ఇది... జనవరి 1 నుండి అమల్లోకి వస్తోంది. ఈ క్రమంలో... రూ. 50 వేలకు పైగా ఉన్న చెక్కులను అవసరమైన సమాచారం కోసం మళ్లీ నిర్ధారించనున్నారు. ఈ విధానంతో చెక్కు చెల్లింపులు మరింత సురక్షితం కానున్నాయి. 


బ్యాంకింగ్ మోసాలను అరికట్టేందుకు ఆర్బీఐ ఎప్పటికప్పుడు కొత్త రూల్స్ తీసుకు వస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా... పాజిటివ్ పే సిస్టంను ప్రవేశపెట్టింది. కొత్త నిబంధనల ప్రకారం చెక్కులు జారీ చేసే వ్యక్తి చెక్కు తేదీని, గ్రహీత పేరు, చెల్లింపు మొతతాన్ని  ఎలక్ట్రానిక్ పద్ధతిలో తిరిగి చేయవలసి ఉంటుంది. చెక్కు జారీ చేసే వ్యక్తి... ఎస్సెమ్మెస్, మొబైల్ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం వంటి ఎలక్ట్రానిక్ పద్ధతుల ద్వారా ఈ సమాచారాన్ని అందించవచ్చు. చెక్ చెల్లింపుకు ముందు ఈ వివరాలను బ్యాంకు సిబ్బంది క్రాస్ చెక్ చేస్తారు. రూ. 50 వేలు దాటితే...  ఏదైనా లోపం కనిపిస్తే అది చెక్ ట్రంకేషన్ సిస్టం ద్వారా గుర్తిస్తుంది. సమాచారాన్ని చెక్ చెల్లింపు చేయవలసిన బ్యాంకు, చెక్కు జారీ చేసిన బ్యాంకులకు అందుతుంది. రూ. 50 వేలు, అంతకంటే ఎక్కువ చెల్లింపులకు సంబంధించి బ్యాంకులు, ఖాతాదారులకు ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయి. ఇక్కడ ఈ సదుపాయం పొందే ఆప్షన్ కూడా ఉంది. ఇది ఖాతాదారు ఇష్టం. రూ.5 లక్షలు, అంతకుమించిన చెక్కులకు సంబంధించి బ్యాంకులు ఈ నిబంధనలను తప్పనిసరి చేయవచ్చు. 


ఎన్‌పీసీఐ(నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)  ఈ వ్యవస్థను అభివృద్ధి చేసి అన్ని బ్యాంకులకు అందుబాటులో తీసుకువచ్చింది.  చెక్కు బ్యాంకుకు వచ్చినప్పుడు ఇష్యూ చేసే వ్యక్తి ఇచ్చిన సమాచారంతో చెక్కుపై ఉన్న వివరాలను పోల్చి చూసి, అన్ని వివరాలు సరిపోలితే ప్రాసెస్ చేస్తారు. లేదంటే రిజెక్ట్ చేస్తారు. పాజిటివ్ పే విధానం కస్టమర్ ఇష్టం. ఆప్షన్ ఎంచుకోవచ్చు. కానీ రూ. 5 లక్షలకు మించిన పేమెంట్లపై బ్యాంకులు దీనిని తప్పనిసరి చేయవచ్చు.


Updated Date - 2020-12-17T19:34:47+05:30 IST