మార్కెట్లోకి జీప్‌ రాంగ్లర్‌ రూబీకాన్‌

ABN , First Publish Date - 2020-03-04T06:27:20+05:30 IST

ఎఫ్‌సీఏ ఇండియా.. దేశీ మార్కెట్లోకి సరికొత్త ఎస్‌యూవీ జీప్‌ రాంగ్లర్‌ రూబీకాన్‌ను తీసుకువచ్చింది. ఈ ఎస్‌యూవీ ధర రూ.68.94 లక్షలు. ఫోర్‌ వీల్‌ డ్రైవ్‌, ఫైవ్‌ డోర్‌ ఎస్‌యూవీ ...

మార్కెట్లోకి జీప్‌ రాంగ్లర్‌ రూబీకాన్‌

ధర రూ.68.94 లక్షలు 


న్యూఢిల్లీ : ఎఫ్‌సీఏ ఇండియా.. దేశీ మార్కెట్లోకి సరికొత్త ఎస్‌యూవీ జీప్‌ రాంగ్లర్‌ రూబీకాన్‌ను తీసుకువచ్చింది. ఈ ఎస్‌యూవీ ధర రూ.68.94 లక్షలు. ఫోర్‌ వీల్‌ డ్రైవ్‌, ఫైవ్‌ డోర్‌ ఎస్‌యూవీ  అయిన రూబీకాన్‌ డెలివరీలను ఈ నెల 15 నుంచి ప్రారంభించనున్నట్లు సంస్థ ప్రెసిడెంట్‌, ఎండీ పార్థా దత్తా తెలిపారు. ఫోర్‌ సిలిండర్‌, టర్బో చార్జ్‌డ్‌ 2 లీటర్‌ పెట్రోల్‌ ఇంజన్‌, 8 స్పీడ్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌తో రాంగ్లర్‌ రూబీకాన్‌ను తీసుకువచ్చినట్లు ఆయన చెప్పారు. వినియోగదారుల నుంచి ఇప్పటికే జీప్‌ రాంగ్లర్‌ ఎస్‌యూవీకి అద్భుతమైన స్పందన లభించిందని, భారత్‌లో ఇది ప్లాగ్‌షిప్‌ మోడల్‌గా మారిందని, తాజాగా రూబీకాన్‌తో మరింత పట్టును చేజిక్కించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. 2016లో కంప్లీట్లీ బిల్ట్‌ యూనిట్‌ (సీబీయూ)గా జీప్‌ రాంగ్లర్‌ను తీసుకురాగా మొత్తం కంపెనీ విక్రయాల్లో దీని వాటా 67 శాతంగా ఉందని దత్తా తెలిపారు.  

Updated Date - 2020-03-04T06:27:20+05:30 IST