అధీకృత సంస్థల నుంచే పాలసీలు తీసుకోండి

ABN , First Publish Date - 2020-07-28T06:32:25+05:30 IST

కొన్ని అవాంఛనీయ శక్తులు మోసపూరితమైన బీమా ఆఫర్లతో ముందుకు వస్తున్నాయని, ఆ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఐఆర్‌డీఏఐ ప్రజలకు సూచించింది. కేవలం...

అధీకృత సంస్థల నుంచే పాలసీలు తీసుకోండి

న్యూఢిల్లీ : కొన్ని అవాంఛనీయ శక్తులు మోసపూరితమైన బీమా ఆఫర్లతో ముందుకు వస్తున్నాయని, ఆ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఐఆర్‌డీఏఐ ప్రజలకు సూచించింది. కేవలం బీమా సంస్థలు, అధీకృత ఏజెంట్ల ద్వారా మాత్రమే పాలసీలు తీసుకోవాలని తెలియజేసింది. కొన్ని శక్తులు వివిధ ప్రభుత్వ ఏజెన్సీల పేరుతో రంగంలోకి దిగి మోసపూరితమైన ఆఫర్లతో ఉచ్చు వేస్తున్నట్టు తన దృష్టికి వచ్చిన నేపథ్యంలో ఈ ప్రకటన చేసింది. 

Updated Date - 2020-07-28T06:32:25+05:30 IST