నెఫ్రోప్లస్‌ చేతికి ఫిలిప్పీన్స్‌ కంపెనీ

ABN , First Publish Date - 2020-10-14T06:29:09+05:30 IST

దేశంలోనే అతిపెద్ద డయాలసిస్‌ నెట్‌వర్క్‌ కలిగిన నెఫ్రోప్లస్‌ విదేశాలకు విస్తరించనుంది. ఫిలిపీన్స్‌కు చెందిన రాయ ల్‌ కేర్‌ డయాలిసి్‌సలో బయటకు వెల్లడించని మొత్తానికి 51శాతం వాటాను కొనుగోలు చేసింది. మరో 25 శాతం వాటాను వచ్చే రెండేళ్లలో సొంతం చేసుకుంటామని నెఫ్రోప్లస్‌ సీఈఓ విక్రమ్‌ ఉప్పల తెలిపారు...

నెఫ్రోప్లస్‌ చేతికి ఫిలిప్పీన్స్‌ కంపెనీ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): దేశంలోనే అతిపెద్ద డయాలసిస్‌ నెట్‌వర్క్‌ కలిగిన నెఫ్రోప్లస్‌ విదేశాలకు విస్తరించనుంది. ఫిలిపీన్స్‌కు చెందిన రాయల్‌ కేర్‌ డయాలిసి్‌సలో బయటకు వెల్లడించని మొత్తానికి  51శాతం వాటాను కొనుగోలు చేసింది. మరో 25 శాతం వాటాను వచ్చే రెండేళ్లలో సొంతం చేసుకుంటామని నెఫ్రోప్లస్‌ సీఈఓ విక్రమ్‌ ఉప్పల తెలిపారు.


విదేశీ మార్కెట్లలోకి విస్తరించే వ్యూహంలో భాగంగా ఫిలిప్పీన్స్‌ మార్కెట్లోకి ముం దుగా ప్రవేశించామని తెలిపారు. ఫిలిప్పీన్స్‌ డయాలసిస్‌ మార్కెట్‌ విలువ 40 కోట్ల డాలర్లు ఉందని, వచ్చే ఐదేళ్లలో 5 కోట్ల డాలర్ల ఆదాయాన్ని ఆర్జించాలని భావిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం రాయల్‌ కేర్‌కు 5-6 డయాలసిస్‌ కేంద్రాలు ఉన్నాయి. వీటిని 2025 నాటికి 50-60 కేంద్రాలకు పెంచుతామని విక్రమ్‌ అన్నారు.   


Updated Date - 2020-10-14T06:29:09+05:30 IST