మెర్సిడెస్‌ నుంచి జీఎల్‌సీ కూపే

ABN , First Publish Date - 2020-03-04T06:26:09+05:30 IST

లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా మార్కెట్లోకి సరికొత్త జీఎల్‌సీ కూపేను విడుదల చేసింది. బీఎస్‌-6 ఇంజన్లతో కూడిన 300డీ 4 మాటిక్‌ డీజిల్‌, 300 4మాటిక్‌ పెట్రోల్‌ వేరియంట్లలో...

మెర్సిడెస్‌ నుంచి జీఎల్‌సీ కూపే

ధర రూ.62.70-రూ.63.70 లక్షలు


ముంబై: లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా మార్కెట్లోకి సరికొత్త జీఎల్‌సీ కూపేను విడుదల చేసింది. బీఎస్‌-6 ఇంజన్లతో కూడిన 300డీ 4 మాటిక్‌ డీజిల్‌, 300 4మాటిక్‌ పెట్రోల్‌ వేరియంట్లలో ఈ కొత్త జీఎల్‌సీ కూపేను తీసుకువచ్చినట్లు మెర్సిడెస్‌ తెలిపింది. ఈ కూపే ధరలు రూ.62.70 లక్షలు, రూ.63.70 లక్షలుగా ఉన్నాయి. ఈ కొత్త కారుతో లగ్జరీ విభాగంలో మొత్తం 8 మోడళ్లను అందించినట్లవుతుందని మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా ఎండీ, సీఈఓ మార్టిన్‌ షువెంక్‌ తెలిపారు. పుణె అసెంబ్లింగ్‌ లైన్‌ నుంచి ఉత్పత్తి చేసిన పదో మోడల్‌ జీఎల్‌పీ కూపే అని ఆయన పేర్కొన్నారు. జీఎల్‌సీ 300 డీ కూపే కేవలం 6.6 సెకన్లలో వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకోనుండగా జీఎల్‌సీ 300 కూపే పెట్రోల్‌ ఇంజన్‌ 6.3 సెకన్లలో వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని మెర్సిడెస్‌ తెలిపింది.

Updated Date - 2020-03-04T06:26:09+05:30 IST