ఎంఎ‌స్‌ఎంఈ రంగాన్ని ఆదుకుంటాం

ABN , First Publish Date - 2020-04-24T06:09:43+05:30 IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎంఎ్‌సఎంఈ రంగాన్ని ఆదుకుంటామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌సింగ్‌ ఠాకూర్‌ హామీ ఇచ్చారు. గురువారం

ఎంఎ‌స్‌ఎంఈ రంగాన్ని ఆదుకుంటాం

  • కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ 

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎంఎ్‌సఎంఈ  రంగాన్ని ఆదుకుంటామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌సింగ్‌ ఠాకూర్‌ హామీ ఇచ్చారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన వెబినార్‌లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎంఎ్‌సఎంఈ ప్రతినిధులతో  మంత్రి మాట్లాడారు.  కేంద్రం, టర్మ్‌, క్యాపిటల్‌ రుణాల వడ్డీకి మూడు నెలల మారటోరియం విధించినా, కొన్ని బ్యాంకులు పట్టించుకోవడం లేదని ఈ సందర్భంగా ఎంఎ్‌సఎంఈ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. ఈ మారటోరియాన్ని అక్టోబరు వరకు పొడిగించాలని కోరారు. అలాగే, జీఎస్టీ, ఆదాయ పన్ను, ఇతర చెల్లింపులకూ అక్టోబరు వరకు గడువు ఇవ్వాలని విజ్ణప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ కుమార్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-04-24T06:09:43+05:30 IST