ఎంఎస్‌ఎంఈల చెల్లింపుల కోసం రూ.లక్ష కోట్ల నిధి
ABN , First Publish Date - 2020-04-25T06:50:39+05:30 IST
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నీ దేశంలో ని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు (ఎంఎ్‌సఎంఈ) చెల్లించాల్సిన బకాయిలన్నింటినీ చెల్లించేందుకు రూ.లక్ష కోట్ల నిధిని ప్రభుత్వం

న్యూఢిల్లీ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నీ దేశంలో ని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు (ఎంఎ్‌సఎంఈ) చెల్లించాల్సిన బకాయిలన్నింటినీ చెల్లించేందుకు రూ.లక్ష కోట్ల నిధిని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ నిధి ఏర్పాటు కోసం తాను ఒక స్కీమ్ రూపొందించానని, ఆమోదం కోసం దాన్ని కేబినెట్ ముందుంచుతామన్నారు. చెల్లింపులు చేస్తున్న కంపెనీకి, అందుకుంటున్న కంపెనీకి, బ్యాంకులకు మధ్య వడ్డీ భారం ఏ విధంగా పంచుకోవాలనే విషయంలో కూడా తాము ఒక ఫార్ములా రూపొందిస్తున్నట్టు మంత్రి చెప్పారు. ఈ నిధి ఎంఎ్‌సఎంఈలకు కొంతవరకు ఊరట కాగలదని అన్నారు.