రూ.8.4 లక్షల కోట్లు
ABN , First Publish Date - 2020-08-20T06:19:56+05:30 IST
ఆర్‌బీఐ తాజా నిర్ణయానికి అనుగుణంగా బ్యాం కులు రూ.8.4 లక్షల కోట్ల రుణాలను పునర్ వ్యవస్థీకరించే అవకాశం ఉందని ఇండియా రేటింగ్ అండ్ రీసెర్చ్ అంచనా వేసింది...

- బ్యాంక్‌లు పునర్ వ్యవస్థీకరించనున్న రుణాలు: ఇండియా రేటింగ్స్
ముంబై: ఆర్‌బీఐ తాజా నిర్ణయానికి అనుగుణంగా బ్యాం కులు రూ.8.4 లక్షల కోట్ల రుణాలను పునర్ వ్యవస్థీకరించే అవకాశం ఉందని ఇండియా రేటింగ్ అండ్ రీసెర్చ్ అంచనా వేసింది. బ్యాంకింగ్ వ్యవస్థలోని మొత్తం రుణాల్లో వీటి వాటా 7.7 శాతం. పునర్‌వ్యవస్థీకరించకపోతే ఈ రుణాల్లో 60 శాతం మొండిబకాయిలుగా మారే అవకాశం ఉండేది. ఇది బ్యాంకులకూ మేలేనని అభిప్రాయపడింది. లేదంటే, మొండిబకాయిలు పెరిగి బ్యాంకులు వాటి కోసం కేటాయింపులనూ పెంచాల్సి వస్తుందని, తత్ఫలితంగా లాభాలకు గండిపడుతుందని ఇండియా రేటింగ్స్ నివేదిక పేర్కొంది.
కార్పొరేట్ రుణాలతోపాటు నాన్-కార్పొరేట్ (చిన్న వ్యాపారాలు, వ్యవసాయ, రిటైల్) రుణాలకూ ఈ అవకాశం కల్పించింది. ఇందుకు విధివిధానాల రూపకల్పన కోసం ప్రముఖ బ్యాంకర్ కేవీ కామత్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సిఫారసుల మేరకు బ్యాంక్‌లు రుణాలను పునర్ వ్యవస్థీకరించనున్నాయి. నివేదికలో మరిన్ని ముఖ్యాంశాలు..
4 2008 నాటి ఆర్థిక మాంద్యం సమయంలో బ్యాంక్‌లు 90 శాతం కార్పొరేట్ రుణాలను పునర్ వ్యవస్థీకరించాల్సి వచ్చింది. కానీ, ఈసారి నాన్-కార్పొరేట్ రుణాల వాటా కూడా అధికంగానే ఉండవచ్చు.
4 ఈసారి కార్పొరేట్ రుణాల్లో రూ.3.3-6.3 లక్షల కోట్లు, నాన్-కార్పొరేట్ రుణాల్లో రూ.2.1 లక్షల కోట్ల వరకు పునర్ వ్యవస్థీకరించే అవకాశం ఉంది.
4 రియల్ ఎస్టేట్, ఎయిర్‌లైన్స్, హోటళ్లు, ఇతర వినియోగదారు సేవల కంపెనీలకిచ్చిన రుణాల్లో అధిక శాతం పునర్ వ్యవస్థీకరణ జరగవచ్చు. విలువపరంగా చూస్తే.. మౌలిక రంగం, విద్యుత్, నిర్మాణ రంగాల్లో రుణ పునర్‌వ్యవస్థీకరణ భారీగా జరగవచ్చు.
4 నాన్-కార్పొరేట్ విభాగ రుణాల రీస్ట్రక్చర్‌లో సగం వాటా ఎంఎ్‌సఎంఈలదే కానుంది. మిగతా సగంలో అగ్రి, రిటైల్ రుణాల వాటా 25 శాతం చొప్పున ఉండే అవకాశం ఉంది.