ఏపీ, తెలంగాణలో జియో చందాదారులు 3.1 కోట్లు

ABN , First Publish Date - 2020-09-29T06:20:57+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో రిలయన్స్‌ జియో ఖాతాలో జూన్‌లో కొత్తగా 1.46 లక్షల మంది చందాదారులు చేరారు. దీంతో రెండు రాష్ట్రాల్లో రిలయన్స్‌ జియో మొత్తం చందాదారులు 3.1 కోట్ల మందికి మించిందని కంపెనీ వెల్లడించింది...

ఏపీ, తెలంగాణలో జియో చందాదారులు 3.1 కోట్లు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): తెలుగు రాష్ట్రాల్లో రిలయన్స్‌ జియో ఖాతాలో జూన్‌లో కొత్తగా 1.46 లక్షల మంది చందాదారులు చేరారు. దీంతో రెండు రాష్ట్రాల్లో రిలయన్స్‌ జియో మొత్తం చందాదారులు 3.1 కోట్ల మందికి మించిందని కంపెనీ వెల్లడించింది. ట్రాయ్‌ గణాంకాల మేరకు దేశవ్యాప్తం గా కూడా జూన్‌లో రిలయన్స్‌ జియో చందాదారులు 45 లక్షలకు పైగా పెరిగి 39.72 లక్షలకు చేరారు. మార్కెట్‌ వాటాపరంగా 34.8 శాతం వాటాతో రిలయన్స్‌ జియో అగ్రస్థానంలో ఉంది. 


Updated Date - 2020-09-29T06:20:57+05:30 IST