దూరం నుంచే కొవిడ్ రోగుల పర్యవేక్షణ
ABN , First Publish Date - 2020-09-18T06:13:00+05:30 IST
క్లౌడ్ ఆధారిత ఈ-హెల్త్ సేవలను విగోకేర్ అందిస్తోంది...

- డాక్టర్లకు విగోకేర్ వినూత్న సేవలు
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): కొవిడ్ రోగులను డాక్టర్లు దూరం నుంచే పర్యవేక్షించడానికి హైదరాబాద్‌కు చెందిన హెల్త్-టెక్ కంపెనీ విగోకేర్..కొవిడ్-19 రిమోట్ పేటెంట్ మానిటరింగ్ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. క్లౌడ్ ఆధారిత ఈ-హెల్త్ సేవలను విగోకేర్ అందిస్తోంది. దగ్గరగా కోవిడ్ రోగులను పరీక్షించడం, పర్యవేక్షించ డం వల్ల డాక్టర్లకు, ఇతర వైద్య సిబ్బందికి కొవిడ్ సోకే రిస్క్ అధికంగా ఉన్నందున ఈ సేవలు డాక్టర్లకు, హెల్త్ ప్రొవైడర్లకు బాగా ఉపయోగపడతాయని విగోకేర్ సీఈఓ, వ్యవస్థాపకుడు చెన్నుపాటి శేఖర్ తెలిపారు. ఇంటి వద్ద ఉన్న రోగులను ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా మానిటర్ చేయడానికి ఈ ప్లాట్‌ఫామ్ దోహదం చేస్తుంది. డాక్టర్లు, హెల్త్‌కేర్ నిపుణులకు సబ్‌స్ర్కిప్షన్ ప్రాతిపదికన ఈ సేవలు అందిస్తారు. తొలుత ఈ సేవలను తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులోకి తీసుకువస్తున్నారు. త్వరలో కర్నా టక, తమిళనాడులకు సేవలను విస్తరించి తర్వాత దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెస్తామన్నారు.