మొదలైన ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్.. చవగ్గా స్మార్ట్‌ఫోన్లు!

ABN , First Publish Date - 2020-12-08T01:01:16+05:30 IST

ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లతో మరోమారు వినియోగదారుల ముందుకు వచ్చేసింది. ఇందులో భాగంగా

మొదలైన ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్.. చవగ్గా స్మార్ట్‌ఫోన్లు!

న్యూఢిల్లీ: ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లతో మరోమారు వినియోగదారుల ముందుకు వచ్చేసింది. ఇందులో భాగంగా ‘మొబైల్స్ బొనాంజా’ సేల్‌ను నేడు ప్రారంభించింది. నాలుగు రోజులపాటు కొనసాగనున్న ఈ సేల్ ఈ నెల 10న ముగుస్తుంది. సేల్‌లో భాగంగా ఎక్స్‌చేంజ్ ఆఫర్లతోపాటు యాపిల్, శాంసంగ్, రియల్‌మి, షియోమీ వంటి బ్రాండ్లపై బ్యాంక్ డీల్స్ ప్రకటించింది. ఈ సేల్‌లో కొనుగోలు చేసే స్మార్ట్‌ఫోన్లపై నో-కాస్ట్ ఈఎంఐ కూడా ఇవ్వనున్నట్టు తెలిపింది. 


ఐఫోన్ ఎస్‌ఈ 64జీబీ స్టోరేజీ వేరియంట్ ధరను రూ. 32,999గా పేర్కొనగా, ఇన్ఫినిక్స్ నోట్ 7 4జీబీ+64జీబీ స్టోరేజీ వేరియంట్ ధరను రూ. 11,499 నుంచి రూ. 9,999కి తగ్గించింది. ఐఫోన్ ఎక్స్ ఆర్ 64జీబీ వేరియంట్ ధరను రూ. 40 వేలుగా పేర్కొంది. ప్రీమియం ఫోన్ల విషయానికి వస్తే, ఐఫోన్ 11 ప్రొ ధరను రూ. 26,601 తగ్గించి రూ. 79,999కే అందుబాటులో ఉంచింది. 


రెడ్‌మి 9ఐ'ఎస్ 4జీబీ+128 జీబీ వేరియంట్ ధరను రూ.9,299 నుంచి రూ.8,999కి తగ్గించింది. రియల్‌మి నర్జో 6జీబీ ర్యామ్+64జీబీ స్టోరేజీ వేరియంట్ అసలు ధర రూ. 14,999 కాగా, దానిని రూ.13,999కే అందుబాటులో ఉంచింది. ఒప్పో ఎ31 64జీబీ వేరియంట్ ధరను రూ.10,990కి, మోటొరోలా మోటో జి9ఐ 4జీబీ+64జీబీ వేరియంట్‌ను రూ.9,999కి అందుబాటులోకి తీసుకురాగా, ఆసుస్ రోగ్ ఫోన్ 8జీబీ+128జీబీ వేరియంట్ ధరను రూ.46,999 నుంచి రూ. 44,999కి తగ్గించింది. 

Updated Date - 2020-12-08T01:01:16+05:30 IST