కరోనా దెబ్బ... కనుమరుగు కానున్న మిత్సుబిషి 'పేజరో' ఎస్‌యూవీ

ABN , First Publish Date - 2020-07-29T00:52:15+05:30 IST

కరోనా ప్రభావం నేపధ్యంలో... జపాన్‌కు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ మిత్సుబిషి సంస్థకు చెందిన పేజరో ఎస్‌యూవీ కనుమరుగు కానుంది. మధ్య శ్రేణి స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం పేజరో తయారీని 2021 నుండి నిలిపివేయనున్నట్లు మిత్సుబిషి మోటార్స్ ప్రకటించింది.

కరోనా దెబ్బ... కనుమరుగు కానున్న మిత్సుబిషి 'పేజరో' ఎస్‌యూవీ

టోక్యో : కరోనా ప్రభావం నేపధ్యంలో... జపాన్‌కు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ మిత్సుబిషి సంస్థకు చెందిన పేజరో ఎస్‌యూవీ కనుమరుగు కానుంది. మధ్య శ్రేణి స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం పేజరో తయారీని 2021 నుండి నిలిపివేయనున్నట్లు మిత్సుబిషి మోటార్స్ ప్రకటించింది.


గతేడాది మందగమనం, ఈ దఫా... కరోనా దెబ్బ భారీగా ప్రభావం చూపిన నేపధ్యంలో... గత రెండేళ్లుగా సంస్థ భారీగా నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ‘పేజరో’ మూసివేత నిర్ణయానికి వచ్చినట్లు ప్రకటించింది. స్పోర్ట్స్ కార్ల విభాగంలో పేజరో ఎస్‌యూవీ ప్రముఖనదిగా పేరొందింది. అత్యంత కఠినమైనదిగా భావించే డాకర్ ర్యాలీలో... కార్ల విభాగంలో 2001 నుండి 2005 వరకు ఈ వాహనం వరుస విజయాలను సాధించింది.


గిన్నిస్ రికార్డులకు కూడా ఎక్కింది. ఇప్పటి వరకు దీనిని ఎవరూ సమం చేయకపోవడం విశేషం. కాగా... కరోనా నేపధ్యంలో కంపెనీ షేర్లు మంగళవారం గతంలో ఎన్నడూ లేని విధంగా పది శాతం పడిపోయాయి.


కరోనా నేపధ్యంలోనే... మార్చి 31, 2021 తో ముగియనున్న ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 140 బిలియన్ యెన్‌ల(1.33 బిలియన్ డాలర్లు) నష్టాన్ని సంస్థ అంచనా వేస్తోంది. ఈ క్రమంలో... పేజరో ఎస్‌యూవీ ఉత్పత్తి నిలిచిపోనుంది. 


Updated Date - 2020-07-29T00:52:15+05:30 IST