మార్కెట్లోకి మళ్లీ మైక్రోమాక్స్‌ ఫోన్లు

ABN , First Publish Date - 2020-10-17T05:43:57+05:30 IST

దేశీయ మొబైల్‌ ఫోన్ల తయారీ కంపెనీ మైక్రోమాక్స్‌ మళ్లీ రంగంలోకి దిగుతోంది. ‘

మార్కెట్లోకి  మళ్లీ మైక్రోమాక్స్‌ ఫోన్లు

హైదరాబాద్‌ యూనిట్‌లో ఉత్పత్తి


న్యూఢిల్లీ : దేశీయ మొబైల్‌ ఫోన్ల తయారీ కంపెనీ మైక్రోమాక్స్‌ మళ్లీ రంగంలోకి దిగుతోంది. ‘ఇన్‌’ బ్రాండ్‌ పేరుతో ఈ పండగల సీజన్‌లోనే దేశీయ మార్కెట్లోకి స్మార్ట్‌ఫోన్లు విడుదల చేయబోతోంది. కంపెనీ సహ వ్యవస్థాపకుడు రాహుల్‌ శర్మ ఈ విషయం ప్రకటించారు. హైదరాబాద్‌, రాజస్థాన్‌లోని భివాడి యూనిట్లలో ‘ఇన్‌’ బ్రాండ్‌ మొబైల్‌ ఫోన్లను తయారు చేస్తున్నట్టు వెల్లడించారు.


ఈ ప్రాజెక్టు కోసం కంపెనీ రూ.500 కోట్లు ఖర్చు చేస్తోంది. దేశంలో మొబైల్‌ ఫోన్లు తయారు చేసే కంపెనీలకు ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక ప్రోత్సాహకాలను మైక్రోమాక్స్‌ పూర్తిగా వినియోగిం చుకోవాలని భావిస్తోంది. ఈ రెండు యూనిట్లు నెలకు 20 లక్షల యూనిట్లను తయారీ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని ఆయన పేర్కొన్నారు. అత్యాఽధునిక ఫీచర్లతో రూ.7,000 నుంచి రూ.20,000 ధరల శ్రేణిలో ఈ స్మార్ట్‌ ఫోన్లను తీసుకురానున్నట్లు శర్మ చెప్పారు. తద్వారా దేశీయ మార్కెట్లో చైనా ఫోన్లకు గట్టి పోటీ ఇవ్వాలని మైక్రోమాక్స్‌ భావిస్తోంది.


Updated Date - 2020-10-17T05:43:57+05:30 IST