తెలంగాణ మార్కెట్లోకి మహీంద్రా ‘ట్రియో’ ఎలక్ట్రిక్‌ ఆటో

ABN , First Publish Date - 2020-09-29T06:18:51+05:30 IST

కొత్త ఎలక్ట్రిక్‌ ఆటో మహీంద్రా ట్రియోను మహీంద్రా ఎలక్ట్రిక్‌ మొబిలిటీ తెలంగాణ మార్కెట్లోకి విడుదల చేసింది. ఫేమ్‌ సబ్సిడీల అనంతరం తెలంగాణలో మహీంద్రా ట్రియో ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.2.7 లక్షలు...

తెలంగాణ మార్కెట్లోకి మహీంద్రా ‘ట్రియో’ ఎలక్ట్రిక్‌ ఆటో

  • ధర రూ.2.7 లక్షలు


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): కొత్త ఎలక్ట్రిక్‌ ఆటో మహీంద్రా ట్రియోను మహీంద్రా ఎలక్ట్రిక్‌ మొబిలిటీ తెలంగాణ మార్కెట్లోకి విడుదల చేసింది. ఫేమ్‌ సబ్సిడీల అనంతరం తెలంగాణలో మహీంద్రా ట్రియో ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.2.7 లక్షలు. ఇది పూర్తిగా భారత్‌లో డిజైన్‌ చేసి అభివృద్ధి చేసిన ఎలక్ట్రిక్‌ ఆటో. గరిష్ఠంగా గంటకు 55 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని మహీంద్రా ఎలక్ట్రిక్‌ ఎండీ, సీఈఓ మహేశ్‌ బాబు తెలిపారు. కేవలం 2.3 సెకండ్లలోనే 0 నుంచి 20 కేఎంపీహెచ్‌ వేగాన్ని అందుకుంటుంది.


మహీంద్రా ట్రియో ద్వారా ఆటో యజమానులు ఏడాదికి రూ.45,000 వరకూ ఆదా చేయొచ్చని కంపెనీ తెలిపింది. ఈ ఆటో కొనుగోలుకు మహీంద్రా ఫైనాన్స్‌ రుణ సదుపాయాన్ని కల్పిస్తోంది. ముందుగా రూ.50 వేలు చెల్లిస్తే సరిపోతుంది. ఎస్‌బీఐ కూడా 10.8 వడ్డీ రేటుకు రుణం ఇస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.


Updated Date - 2020-09-29T06:18:51+05:30 IST