జహీరాబాద్‌ ప్లాంట్‌లో ‘కే2’ ట్రాక్టర్ల తయారీ

ABN , First Publish Date - 2020-11-18T06:05:09+05:30 IST

తెలంగాణలోని జహీరాబాద్‌ వద్ద ఉన్న ట్రాక్టర్ల తయారీ యూనిట్‌ను విస్తరిస్తున్నట్లు మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎం అండ్‌ ఎం) ప్రకటించింది...

జహీరాబాద్‌ ప్లాంట్‌లో ‘కే2’ ట్రాక్టర్ల తయారీ

  • రూ.100 కోట్ల పెట్టుబడి 
  • మరో 1,500 ఉద్యోగాలు  
  • మహీంద్రా గ్రూప్‌ వెల్లడి 


హైదరాబాద్‌: తెలంగాణలోని జహీరాబాద్‌ వద్ద ఉన్న ట్రాక్టర్ల తయారీ యూనిట్‌ను విస్తరిస్తున్నట్లు మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎం అండ్‌ ఎం) ప్రకటించింది. విస్తరణ కార్యకలాపాల్లో భాగంగా ఈ ప్లాంట్‌లో కొత్తగా ‘కే2’ సిరీస్‌ ట్రాక్టర్లను ఉత్పత్తి చేయనున్నట్లు వెల్లడించింది. ఇందుకోసం రూ.100 కోట్ల పెట్టుబడులతో ఈ ప్లాంట్‌ను విస్తరించనున్నట్టు ఎం అండ్‌ ఎం తెలిపింది. లైట్‌వెయిట్‌ ట్రాక్టర్‌ ప్రొగ్రామ్‌లో భాగంగా కొత్తగా కే2 సిరీస్‌ ట్రాక్టర్లను అభివృద్ధి చేసినట్లు కంపెనీ పేర్కొంది. దేశీయ మార్కెట్‌తో పాటు అమెరికా, జపాన్‌, ఆగ్నేయాసియా సహా ఇతర అంతర్జాతీయ మార్కెట్ల కోసం వివిధ హార్స్‌పవర్‌ శ్రేణిలో మొత్తం 37 మోడళ్లను  తీసుకురానున్నట్లు కంపెనీ తెలిపింది. 


మిత్సుబుషితో జట్టు.. 

జపాన్‌కు చెందిన మిత్సుబుషి మహీంద్రా అగ్రికల్చర్‌ మెషినరీ, భారత్‌లోని మహీంద్రా రీసెర్చ్‌ వ్యాలీ సంస్థలు సంయుక్తంగా కొత్త ట్రాక్టర్‌ సిరీ్‌సను అభివృద్ధి చేశాయి. జహీరాబాద్‌ ప్లాంట్‌లో నాలుగు కొత్త ట్రాక్టర్‌ ప్లాట్‌ఫామ్స్‌పై కే2 సిరీస్‌ ట్రాక్టర్లను ఉత్పత్తి చేయనున్నట్లు ఎం అండ్‌ ఎం ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఆటోమోటివ్‌, ఫామ్‌ ఎక్వి్‌పమెంట్‌ సెక్టార్‌) రాజేశ్‌ జెజురికర్‌ చెప్పారు. ట్రాక్టర్ల ఉత్పత్తిలో జహీరాబాద్‌ కీలకంగా ఉందని, ప్రస్తుతం ఈ ప్లాంట్‌ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం లక్ష ట్రాక్టర్లుగా ఉందని ఆయన తెలిపారు.   ప్రస్తుతం ఈ ప్లాంట్‌లో 1,500 మంది ఉద్యోగులుండగా 2024 నాటికి వీరి సంఖ్య రెట్టింపవుతుందని రాజేశ్‌ పేర్కొన్నారు. జహీరాబాద్‌ ప్లాంట్‌పై మహీంద్రా ఇప్పటి వరకు రూ.1,087 కోట్ల పెట్టుబడులు పెట్టింది. 30 హెచ్‌పీ నుంచి 100 హెచ్‌పీ వరకు వివిధ శ్రేణిలో ట్రాక్టర్లను కంపెనీ ఇక్కడ ఉత్పత్తి చేస్తోంది. 


స్వాగతించిన మంత్రి కేటీఆర్‌ 

కే2 సీరిస్‌ ట్రాక్టర్లను జహీరాబాద్‌ ప్లాంట్‌లో ఉత్పత్తి చేయాలన్న మహీంద్రా గ్రూప్‌ నిర్ణయాన్ని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు స్వాగతించారు. తమ పెట్టుబడుల విఽధానాలు కొత్త పరిశ్రమలతో పాటు ఇప్పటికే ఉన్న కంపెనీలను కూడా కొత్త పెట్టుబడులకు పురికొల్పుతున్నాయనేందుకు ఇదే నిదర్శనమన్నారు. 


Updated Date - 2020-11-18T06:05:09+05:30 IST