మహీంద్రా సరికొత్త థార్‌

ABN , First Publish Date - 2020-10-03T06:57:26+05:30 IST

మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎం అండ్‌ ఎం) మార్కెట్లోకి సరికొత్త ఎస్‌యూవీ ‘థార్‌’ ను విడుదల చేసింది...

మహీంద్రా సరికొత్త థార్‌

  • ప్రారంభ ధర రూ.9.8 లక్షలు 


న్యూఢిల్లీ : మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎం అండ్‌ ఎం) మార్కెట్లోకి సరికొత్త ఎస్‌యూవీ ‘థార్‌’ ను విడుదల చేసింది. ఈ ఎస్‌యూవీ ధరలు రూ.9.8 లక్షల నుంచి రూ.13.75 లక్షల (ఎక్స్‌షోరూమ్‌) మధ్యన ఉన్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ పవర్‌ట్రెయిన్‌ ఆప్షన్స్‌తో ఏఎక్స్‌, ఎల్‌ఎక్స్‌ వేరియంట్లతో థార్‌ను తీసుకువచ్చింది. పెట్రోల్‌ ఏఎక్స్‌ వేరియంట్‌ ధరలు రూ.9.8 లక్షలు, రూ.10.65 లక్షలు, రూ.11.9 లక్షలుగా ఉన్నాయి. కాగా డీజిల్‌ వేరియంట్‌ ధరలు రూ.10.85 లక్షలు, రూ.12.10 లక్షలు, రూ.12.2 లక్షలుగా ఉన్నాయి. పెట్రోల్‌ వెర్షన్‌ను 2 లీటర్‌ పవర్‌ట్రెయిన్‌ ఇంజన్‌తో తీసుకురాగా డీజిల్‌ వెర్షన్‌ను 2.2 లీటర్‌ పవర్‌ట్రెయిన్‌ ఇంజన్‌తో రూపొందించినట్లు మహీంద్రా పేర్కొంది. కొత్త థార్‌లోని అన్ని వేరియంట్లను ఫోర్‌ వీల్‌ డ్రైవ్‌తో తీసుకువచ్చినట్లు తెలిపింది. కాగా మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన పెట్రోల్‌ ఎల్‌ఎక్స్‌ వేరియంట్‌ ధర రూ.12.49 లక్షలుగా ఉండగా డీజిల్‌ వెర్షన్‌ ధరలు రూ12.85 లక్షలు, రూ.12.95 లక్షలుగా ఉన్నాయి. ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన పెట్రోల్‌ వేరియంట్‌ ధరలు రూ.13.45 లక్షలు, రూ.12.95 లక్షలుగా ఉండగా 2 సిక్స్‌ స్పీడ్‌ ఆటోమేటిక్‌ డీజిల్‌ వేరియంట్‌ ధరలు రూ.13.65 లక్షలు, రూ.13.75 లక్షలుగా ఉన్నాయి. కొత్త థార్‌కు శుక్రవారం నుంచి బుకింగ్‌లు ప్రారంభించామని, వచ్చే నెల నుంచి డెలివరీలు ప్రారంభించనున్నట్లు ఎం అండ్‌ ఎం మేనేజింగ్‌ డైరెక్టర్‌ పవన్‌ గోయెంకా తెలిపారు. కాగా హైదరాబాద్‌లోని వీవీసీ మోటార్స్‌ షోరూమ్‌లో సరికొత్త థార్‌ను టాలీవుడ్‌ నటుడు శ్రీకాంత్‌, వీవీసీ మోటార్స్‌ ఎండీ రాజేంద్ర ప్రసాద్‌ విడుదల చేశారు.

Updated Date - 2020-10-03T06:57:26+05:30 IST