‘ఆటో’ డీలర్లపై లాక్‌డౌన్‌ దెబ్బ

ABN , First Publish Date - 2020-04-07T05:50:27+05:30 IST

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన లాక్‌డౌన్‌తో దేశంలోని ఆటో డీలర్ల కష్టాలు మరింత తీవ్రమవయ్యాయి. వాహన షోరూమ్‌లు మూతపడ్డాయి. షోరూముల్లోని వాహనాలు అమ్ముడుపోయే పరిస్థితి లే దు. అదే సమయంలో బీఎస్‌-4 వాహనాల నిల్వలు భారీగా...

‘ఆటో’ డీలర్లపై లాక్‌డౌన్‌ దెబ్బ

న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన లాక్‌డౌన్‌తో దేశంలోని ఆటో డీలర్ల కష్టాలు మరింత తీవ్రమవయ్యాయి. వాహన షోరూమ్‌లు మూతపడ్డాయి. షోరూముల్లోని వాహనాలు అమ్ముడుపోయే పరిస్థితి లే దు. అదే సమయంలో బీఎస్‌-4 వాహనాల నిల్వలు భారీగా మిగిలి పోయాయి. కంపెనీలు కొంతవరకు ఈ నష్టాలు భర్తీ చేసినా, డీలర్లకు భారీ నష్టాలు తప్పవని ఇండియా రేటింగ్స్‌ ఒక నివేదికలో పేర్కొం ది. లాక్‌డౌన్‌ ముగిసిన పది రోజుల్లోపు బీఎస్‌-4 వాహనాలు అన్నీ అమ్ముకోవాలని సుప్రీంకోర్టు ఢిల్లీలోని డీలర్లకు మాత్రమే అనుమతి ఇచ్చింది. అయినా అంత స్వల్ప వ్యవధిలో ఎంత డిస్కౌంట్స్‌ ఇచ్చినా కొనుగోలుదారులు  వాహనాలు కొనేందుకు పెద్దగా ఆసక్తి చూపకపోవచ్చని భావిస్తున్నారు.

Read more