‘వాటర్, శానిటేషన్’కు కాస్పియన్ డెట్ రూ.72 కోట్ల రుణాలు
ABN , First Publish Date - 2020-12-19T05:56:49+05:30 IST
హైదరాబాద్‌కు చెందిన కార్పొరేట్ లెండింగ్ ఫైనాన్షియల్ సేవల కంపెనీ కాస్పియన్ డెట్ వాటర్, శానిటేషన్, హైజిన్ (వాష్) వ్యవస్థను

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్‌కు చెందిన కార్పొరేట్ లెండింగ్ ఫైనాన్షియల్ సేవల కంపెనీ కాస్పియన్ డెట్ వాటర్, శానిటేషన్, హైజిన్ (వాష్) వ్యవస్థను బలోపేతం చేయడానికి 2028 నాటికి కోటి డాలర్ల (దాదాపు రూ.72 కోట్లు) నిధులు అందించనుంది. ఇందుకు అనుగుణంగా వాటర్ డాట్ ఆర్గ్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం వల్ల వాష్ రంగంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎ్‌సఎంఈ) సంస్థలకు నిధుల లభ్యత పెరుగుతుందని కాస్పియన్ డెట్ మేనేజింగ్ డైరెక్టర్ విశ్వనాథ్ ప్రసాద్ తెలిపారు.