రుణ చెల్లింపు సామర్థ్యం తగ్గింది
ABN , First Publish Date - 2020-10-22T06:43:22+05:30 IST
కరోనా వైరస్ ప్రజల ఆదాయం, రుణ చెల్లింపు సామర్థ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపింది. దేశంలోని 6 ప్రధాన మెట్రో నగరాల్లో ప్రజల ఆదాయం తగ్గడంతో రుణ చెల్లింపు సామర్థ్యం విశేషం గా క్షీణించింది...
- కొవిడ్‌పై పైసాబజార్ అధ్యయనంలో వెల్లడి
- మూడో స్థానంలో హైదరాబాద్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): కరోనా వైరస్ ప్రజల ఆదాయం, రుణ చెల్లింపు సామర్థ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపింది. దేశంలోని 6 ప్రధాన మెట్రో నగరాల్లో ప్రజల ఆదాయం తగ్గడంతో రుణ చెల్లింపు సామర్థ్యం విశేషం గా క్షీణించింది. ఇందులో హైదరాబాద్ 3వ స్థానంలో ఉంది. ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబైలపై అత్యధిక ప్రభావం ఉందని పైసాబజార్ అధ్యయనంలో వెల్లడైంది. 35 పట్టణాలకు చెందిన 24-57 సంవత్సరాల మధ్య వయసున్న, రూ.లక్ష పైబడిన ఆదాయం గల 8,500 మందిపై అధ్యయనం నిర్వహించింది.
- కొవిడ్ నిబంధనల కారణంగా ఆదాయం కోల్పోయామని 86శాతం మంది స్వయం ఉపాధి ఖాతాదారులు తెలిపారు. ఆదాయం జీరో స్థాయికి వచ్చిందని నాలుగో వంతుకు పైగా ఖాతాదారులు వెల్లడించారు.
- వేతన జీవుల్లో 56శాతం మంది తమ వేతనంపై కొవిడ్ ప్రభావం ఉందన్నారు. హైదరాబాదీల్లో 63శాతం మంది ఆదాయంపై ప్రతికూల ప్రభావం ఉందని చెప్పారు. 20శాతం మంది పూర్తిగా ఆదాయం కోల్పోయినట్టు వెల్లడించారు.
- హైదరాబాద్‌కు చెందిన దాదాపు 80శాతం మంది స్వయం ఉపాధి ఖాతాదారులు, 58ు వేతన జీవులు తమ ఆదాయాలు తగ్గాయని తెలిపారు.