ఎల్‌ఐసీకి ఈక్విటీ కిక్
ABN , First Publish Date - 2020-12-07T06:14:04+05:30 IST
స్టాక్ మార్కెట్లో అప్రతిహతితంగా కొనసాగుతున్న ర్యాలీ ప్రభుత్వ రంగంలోని భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ)కు సిరులు కురిపిస్తోంది. మార్కె ట్లో బుల్ జోరుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020- 21) తొలి ఆరు నెలల్లో ఎల్‌ఐసీ ఈక్విటీ పెట్టుబడుల విలువ ఏకంగా 40 శాతం వృద్ధి చెంది రూ.5.7 లక్షల కోట్లకు...

- 6 నెలల్లో 40 శాతం లాభాలు
- సెప్టెంబరు నాటికి రూ.5.7 లక్షల కోట్లకు చేరిన పెట్టుబడుల విలువ
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లో అప్రతిహతితంగా కొనసాగుతున్న ర్యాలీ ప్రభుత్వ రంగంలోని భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ)కు సిరులు కురిపిస్తోంది. మార్కె ట్లో బుల్ జోరుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020- 21) తొలి ఆరు నెలల్లో ఎల్‌ఐసీ ఈక్విటీ పెట్టుబడుల విలువ ఏకంగా 40 శాతం వృద్ధి చెంది రూ.5.7 లక్షల కోట్లకు (7,700 కోట్ల డాలర్లు) చేరింది. కోటక్ ఇనిస్టిట్యూషనల్ సెక్యూరిటీస్ రూపొందించిన తాజా నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. కాగా గడిచిన రెండు నెలల్లో (అక్టోబరు,నవంబరు) సెన్సెక్స్ మరో 14 శాతం పెరిగింది. ఈ లెక్కన చూస్తే అక్టోబరు నుంచి ఈ నెల 4 వరకు చూస్తే ఎల్‌ఐసీ ఈక్విటీ పెట్టుబడుల విలువ 8,700 కోట్ల డాలర్లకు (సుమారు రూ.6.43 లక్షల కోట్లు) చేరింది.
రూ.55,000 కోట్ల కొత్త పెట్టుబడులు
కరోనా భయంతో ఈ సంవత్సరం మార్చిలో దేశీయ స్టాక్ మార్కెట్ 35 శాతం పడిపోయింది. దాంతో ఎల్‌ఐసీ ఈక్విటీ పెట్టుబడుల విలువ ఆరేళ్ల కనిష్ఠ స్థాయి 5,500 కోట్ల డాలర్లకు చేరింది. మరోవైపు మార్కెట్ పతనంతో అనేక మంచి కంపెనీల షేర్లు చాలా చవకగా అందుబాటులోకి వచ్చాయి. ఎల్‌ఐసీ దీన్ని అవకాశంగా మలుచుకుంది. అంతేకాకుండా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్- సెప్టెంబరు మధ్య కాలంలో ఏకంగా ఈక్విటీల్లో రూ.55,000 కోట్ల పెట్టుబడులు పెట్టింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో పెట్టిన పెట్టుబడులు రూ.32,800 కోట్లుగా ఉన్నాయి. ఈ పెట్టుబడులతో 2020 -21 ప్రధమార్థంలో టాప్ 200 స్టాక్స్‌ల్లో ఎల్‌ఐసీ పెట్టుబడుల విలువ 5,500 కోట్ల డాలర్ల నుంచి 7,700 డాలర్లకు పెరిగాయి.
పెరిగిన వాటా
ఈ ఏడాది జూలై నుంచి ఎల్‌ఐసి మంచి కంపెనీల షేర్లలో పెట్టుబడులు ఉధృతం చేసింది. యస్ బ్యంక్ హెచ్‌డీఎ్‌ఫసీ ఏఎంసీ, మహానగర్ గ్యాస్, రామ్‌కో సిమెం ట్, ఆల్‌కెమ్ ల్యాబ్స్ వంటి కంపెనీల షేర్లను పెద్ద ఎత్తున కొనుగోలు చేసింది. కంటైనర్ కార్పొరేషన్ వంటి కంపెనీల ఈక్విటీలోనూ తన వాటాను 2.1 శాతం నుం చి 4.4 శాతానికి పెంచుకుంది. ఇదే సమయంలో బ్యాంక్ ఆఫ్ బరోడాలో వాటాను పూర్తిగా వదిలించుకోగా డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీ్‌సలో వాటాను 4.2 శాతం నుంచి 2.2 శాతానికి తగ్గించుకుంది. మరోవైపు పెద్దగా లాభం లేదనుకున్న జీఎంఆర్ ఇన్‌ఫ్రా వంటి కంపెనీల షేర్లను వదిలించుకుంది. మార్కెట్ ర్యాలీలో ఎల్‌ఐసీ వ్యూహాత్మకంగా వ్యవహరించటం ఎంతగానో కలిసివచ్చిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.