కేజీ బేసిన్‌ డీ5 నుంచి గ్యాస్‌ ఉత్పత్తి

ABN , First Publish Date - 2020-03-18T06:18:30+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ తీరంలోని కేజీ బేసిన్‌లో ప్రభుత్వ రంగంలోని ఓఎన్‌జీసీ గ్యాస్‌ ఉత్పత్తి ప్రారంభించింది. ఈ బేసిన్‌లోని కేజీ-డీ5 బ్లాకులో ప్రస్తుతం రోజుకు 2.5 లక్షల ప్రామాణిక ఘనపు మీటర్ల...

కేజీ బేసిన్‌ డీ5 నుంచి గ్యాస్‌ ఉత్పత్తి

ఓఎన్‌జీసీ వెల్లడి


న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ తీరంలోని కేజీ బేసిన్‌లో ప్రభుత్వ రంగంలోని ఓఎన్‌జీసీ గ్యాస్‌ ఉత్పత్తి ప్రారంభించింది. ఈ బేసిన్‌లోని కేజీ-డీ5 బ్లాకులో ప్రస్తుతం రోజుకు 2.5 లక్షల ప్రామాణిక ఘనపు మీటర్ల గ్యాస్‌ (ఎంఎంఎస్‌సీఎండీ) ఉత్పత్తి చేస్తున్నట్టు తెలిపింది. అయితే ఎప్పటి నుంచి ఈ బ్లాకులో గ్యాస్‌ ఉత్పత్తి ప్రారంభించిందీ కంపెనీ వెల్లడించలేదు. త్వరలోనే రోజువారీ ఉత్పత్తిని 7.5 లక్షల ఎంఎంఎ్‌ససీఎండీకి పెంచనున్నట్టు తెలిపింది. కేజీ బేసిన్‌లో రిలయన్స్‌ గ్యాస్‌ క్షేత్రానికి సమీపంలోనే ఈ క్షేత్రం ఉంది. ఈ బ్లాక్‌ నుంచి భారీగా గ్యాస్‌, ముడి చమురు ఉత్పత్తి చేసేందుకు ఓఎన్‌జీసీ సుమారు రూ.37,518 కోట్లు పెట్టుబడిగా పెడుతోంది.  ఈ బ్లాక్‌ పూర్తిగా అందుబాటులోకి వస్తే రోజుకు 78,000 బ్యారెళ్ల ముడి చమురు, 1.5 కోట్ల ఎంఎంఎస్‌సీఎండీల గ్యాస్‌ ఉత్పత్తి చేసేందుకు వీలవుతుందని భావిస్తోంది. 

Updated Date - 2020-03-18T06:18:30+05:30 IST