పదిహేడేళ్ళ క్రితం... కేవలం రూ. 130 పెట్టుబడి.. ఇప్పుడు...

ABN , First Publish Date - 2020-12-20T19:36:17+05:30 IST

పదిహేడేళ్ళ క్రితం కేవలం రూ. 130 పెట్టుబడితో మొదలైన ఫార్మా దిగ్గజం దివిస్ ల్యాబ్స్ షేర్ ధర శనివారం రూ. 3,825 గా ముగిసింది. ఒక దశలోనైతే... రూ. 3,848 తో జీవనకాల గరిష్టాన్ని తాకడం మరో విశేషం.

పదిహేడేళ్ళ క్రితం... కేవలం రూ. 130 పెట్టుబడి.. ఇప్పుడు...

ముంబై : పదిహేడేళ్ళ క్రితం కేవలం రూ. 130 పెట్టుబడితో మొదలైన ఫార్మా దిగ్గజం దివిస్ ల్యాబ్స్ షేర్ ధర శనివారం రూ. 3,825 గా ముగిసింది. ఒక దశలోనైతే... రూ. 3,848 తో జీవనకాల గరిష్టాన్ని తాకడం మరో విశేషం. ఆదివారం ప్రారంభ సెషన్‌లో  0.33 శాతం లాభపడి రూ. 3,837 వద్ద ప్రారంభమైంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ శనివారం నాటికి రూ. లక్ష కోట్లు దాటడం గమనార్హం. ఈ ఏడాది(2020 క్యాలెండర్ సంవత్సరం) స్టాక్ రెండింతల కంటే ఎక్కువగా పెరిగింది. 


కంపెనీ వాటాదారులకు ఈ క్రమంలో భారీ రిటర్న్ లు వచ్చినట్లైంది. తెలుగు రాష్ట్రాల నుండి ఇలాంటి అరుదైన ఘనత సాధించిన కంపెనీ దివీస్ కావడం గమనార్హం. అంతేకాదు... దేశంలో రూ. లక్ష కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ దాటిన రెండో ఫార్మా కంపెనీగా నిలిచింది. 


నిన్న మార్కెట్ ముగిసే సమయానికి దివిస్ కంపెనీ స్టాక్ రూ. 1,01,556.33 కోట్లుగా ఉంది. సన్ ఫార్మా మార్కెట్ క్యాప్ రూ. 1,37,082.62 కోట్లుగా ఉంది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల్లో దివిస్ 30 వ స్థానంలో ఉంది. 


 ఇక... దివిస్ ల్యాబ్స్ డిసెంబర్ ఒకటిన ఒంటిమామిడి, కోనా ఫారెస్ట్(ఆంధ్రప్రదేశ్)లో యూనిట్ III ఫెసిలిటీ(ప్రాజెక్టు)ను ప్రకటించింది. ఇక్కడ రూ. 1,500 కోట్లు పెట్టుబడులు పెడుతున్నట్లు వెల్లడించింది. మరికొద్ది నెలల్లో ఈ యూనిట్ లో కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. 


ఇదే క్రమంలో... కంపెనీ ఇటీవల పెద్ద ఎత్తున విస్తరణను చేపట్టింది. ఇక  విస్తరణకు అవసరమైన నిధులను అంతర్గత వనరుల ద్వారానే సమకూర్చుకుంటోంది తప్ప రుణాల జోలికి వెళ్ళకపోవడం మరో విశేషం.


 ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థానికి ఏకీకృత ఖాతాల ప్రకారం దివిస్ ల్యాబ్స్ రూ. 3,506 కోట్ల మొత్తం ఆధాయాన్ని, రూ. 1,012 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. పదిహేడేళ్ళ క్రితం కొనుగోలు చేసిన దివీస్ ల్యాబ్ షే... ఈ ఏడాదిలో 109 శాతం లాభపడడం గమనార్హం. అంతేకాదు... ఈ(2020) ప్రారంభంలో కేవలం రూ. 1,860 వద్ద ఉన్న స్టాక్ ఇప్పుడు రూ. 3,800 లకు చేరుకుంది. 

Updated Date - 2020-12-20T19:36:17+05:30 IST