ఉద్యోగాలున్నాయ్‌!

ABN , First Publish Date - 2020-06-26T06:05:06+05:30 IST

కొవిడ్‌ సంక్షోభంలో కంపెనీలు ఉద్యోగుల వేతనాలు తగ్గిస్తూ.. ఉద్యోగులను తొలగిస్తున్నాయి. వ్యయ నియంత్రణపై దృష్టి పెడుతున్నాయి. అయి తే.. కొన్ని రంగాల్లోని కంపెనీలు మాత్రం నియామకాలు...

ఉద్యోగాలున్నాయ్‌!

  • క్లౌడ్‌ కంప్యూటింగ్‌, కాంటాక్ట్‌లెస్‌ టెక్నాలాజీల్లో నియామకాలు
  • కొద్ది నెలల్లో మళ్లీ మామూలు స్థాయికి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): కొవిడ్‌ సంక్షోభంలో కంపెనీలు ఉద్యోగుల వేతనాలు తగ్గిస్తూ.. ఉద్యోగులను తొలగిస్తున్నాయి. వ్యయ నియంత్రణపై దృష్టి పెడుతున్నాయి. అయి తే.. కొన్ని రంగాల్లోని కంపెనీలు మాత్రం నియామకాలు చేపడుతున్నాయి. క్లౌడ్‌ కంప్యూటింగ్‌, కాంటాక్ట్‌లెస్‌ టెక్నాలజీలు, డేటా ప్రాసెసింగ్‌ వంటి విభాగాల్లో నియామకాలకు కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. ఎడ్యుటెక్‌, లాజిస్టిక్స్‌, సరఫరా వ్యవస్థ నిర్వహణ, ఆన్‌లైన్‌లో బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ సేవలందిస్తున్న ఫిన్‌టెక్‌ కంపెనీలు కూడా నియామకాలు చేపడుతున్నాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. విమానయానం, పర్యాటకం, ఆతిథ్యం రంగాలు వెంటనే కోలుకోకపోయినప్పటికీ.. మిగిలిన రంగాల్లో కోవిడ్‌ సంక్షోభం ముగిసిన తర్వాత నియమకాలు పుంజుకుంటాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ‘ఔషధ, రక్షణ, ఆన్‌లైన్‌ లావాదేవీలు, లాజిస్టిక్స్‌ వంటి రంగాలపై కోవిడ్‌ ప్రభావం లేదని ఈ రంగాలకు చెందిన కంపెనీలు నియామకాలు కొనసాగిస్తున్నాయని హ్యుసిస్‌ కన్సల్టెన్సీ సీఈఓ జీఆర్‌ రెడ్డి తెలిపారు. వీటితో పాటు రిటైల్‌, హెల్త్‌కేర్‌ రంగాలకు ప్రొడక్ట్‌లను అభివృద్ధి చేస్తున్న టెక్నాలజీ కంపెనీలు నియామకాలు చేపడుతున్నాయి. 


కోవిడ్‌ ప్రభావంతో నియామకాలపై కంపెనీలు ప్రస్తుతం ఆచితూచి అడుగులు వేస్తున్నా త్వరలోనే కొవిడ్‌కు ముందుతో పోలిస్తే నియామకాలు 50 శాతానికైనా చేరవచ్చని హైదరాబాద్‌కు చెందిన కంపెనీలో పని చేస్తున్న మానవ వనరుల విభాగంలోని అధికారి ఒకరు తెలిపారు.  


ఎక్కడి నుంచైనా పని: కొవిడ్‌-19 కారణంగా ప్రస్తుతం అంతర్జాతీయంగా అనేక కంపెనీలు ఇంటి నుంచి పని (డబ్ల్యూఎ్‌ఫహెచ్‌) అనుసరిస్తున్నాయి. కరోనా తర్వాత కూడా ఇదే ధోరణి కొనసాగనుంది. డబ్ల్యూఎ్‌ఫహెచ్‌ నుంచి వర్క్‌ ఫ్రమ్‌ ఎనీవేర్‌ దిశగా కంపెనీలు అడుగులు వేయనున్నాయి. విదేశీ కంపెనీలు భారత్‌లో నియామకాలను చేపట్టి ఇక్కడి నుంచి పని చేయించుకోనున్నాయని నిపుణులు చెబుతున్నా రు. సెప్టెంబరు-అక్టోబరు తర్వాత వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కు దోహదం చేసే టెక్నాలజీలు, క్లౌడ్‌ కంప్యూటింగ్‌లో నియామకాలు బాగా పెరిగే వీలుంది. టెలికామ్‌ రంగంలోని బీపీఓ విభాగంలో బాగా నియామకాలు జరుగుతున్నాయని, సమీప భవిష్యత్తులో నెట్‌వర్కింగ్‌ రంగంలోనూ ఉద్యోగావకాశాలు రానున్నాయని టెలికాం రంగంలోని కంపెనీలకు సేవలందిస్తున్న ఐటీ కంపెనీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.


Updated Date - 2020-06-26T06:05:06+05:30 IST