ప్రపంచ ఆర్థికవ్యవస్థ కోలుకోవడానికి ఐదేళ్లు... ప్రపంచ బ్యాంకు ప్రధాన ఆర్థికవేత్త రీన్‌హర్ట్

ABN , First Publish Date - 2020-09-18T01:53:21+05:30 IST

కరోనా నేపధ్యంలో... ప్రపంచ ఆర్థికవ్యవస్థ దారుణంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ సంక్షోభం నుండి బయట పడేందుకు చాలా సమయంపడుతుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేస్తోంది. ఈ మేరకు ప్రపంచ బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్ కార్మెన్ రీన్‌హర్ట్ గురువారం మాట్లాడుతూ.., ఈ సంక్షోభం నుండి బయటపడేందుకు అయిదేళ్లు పడుతుందని పేర్కొన్నారు. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు లాక్‌డౌన్, షట్‌డౌన్ వంటివి చేపట్టారని, ఈ పరిమిత చర్యల తర్వాత... ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభమైనప్పటికీ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి కనీసం ఐదు సంవత్సరాలు పట్టవచ్చునని చెబుతున్నారు.

ప్రపంచ ఆర్థికవ్యవస్థ కోలుకోవడానికి ఐదేళ్లు... ప్రపంచ బ్యాంకు ప్రధాన ఆర్థికవేత్త రీన్‌హర్ట్

వాషింగ్టన్ డీసీ : కరోనా నేపధ్యంలో... ప్రపంచ ఆర్థికవ్యవస్థ దారుణంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ సంక్షోభం నుండి బయట పడేందుకు చాలా సమయంపడుతుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేస్తోంది.


ఈ మేరకు ప్రపంచ బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్ కార్మెన్ రీన్‌హర్ట్ గురువారం మాట్లాడుతూ.., ఈ సంక్షోభం నుండి బయటపడేందుకు అయిదేళ్లు పడుతుందని పేర్కొన్నారు. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు లాక్‌డౌన్, షట్‌డౌన్ వంటివి చేపట్టారని, ఈ పరిమిత చర్యల తర్వాత... ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభమైనప్పటికీ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి కనీసం ఐదు సంవత్సరాలు పట్టవచ్చునని చెబుతున్నారు.


కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాల్లో ఆర్థికవ్యవస్థ మరింతగా క్షీణించిందని, ఇది మరింత అసమానతలను పెంచుతోందని కార్మెన్ అన్నారు. సంపన్న దేశాల కంటే పేద దేశాలు ఎక్కువగా ఆర్థికంగా ప్రభావితమవుతాయన్నారు. ఇరవై ఏళ్లలో మొదటిసారి ప్రపంచ పేదరికం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

Updated Date - 2020-09-18T01:53:21+05:30 IST