చెన్నై బులియన్ కంపెనీపై ఐటీ దాడులు
ABN , First Publish Date - 2020-11-13T08:27:45+05:30 IST
చెన్నై కేంద్రంగా పని చేస్తున్న బులియన్ ట్రేడింగ్ కంపెనీపై ఐటీ దాడులు జరిగాయి. ఆ కంపెనీకి చెందిన చెన్నై, ముంబై, కోల్కతా, కోయంబత్తూర్, సేలం, త్రిచి, మదురై, తిరునల్వేలి సహా 32 కార్యాలయాలపై మంగళవారం...
- రూ.500 కోట్ల అప్రకటిత ఆదాయం వెలికితీత
చెన్నై: చెన్నై కేంద్రంగా పని చేస్తున్న బులియన్ ట్రేడింగ్ కంపెనీపై ఐటీ దాడులు జరిగాయి. ఆ కంపెనీకి చెందిన చెన్నై, ముంబై, కోల్కతా, కోయంబత్తూర్, సేలం, త్రిచి, మదురై, తిరునల్వేలి సహా 32 కార్యాలయాలపై మంగళవారం నిర్వహించిన దాడుల్లో రూ.500 కోట్లకు పైబడి అప్రకటిత ఆదాయం కనుగొన్నట్టు సీబీడీటీ ప్రకటించింది. ఆ మొత్తంలో రూ.150 కోట్లకు సంబంధించి కంపెనీ స్వచ్ఛంద ప్రకటన చేసినట్టు తెలిపింది. కంపెనీకి చెందిన వ్యాపారేతర పెట్టుబడులు, లాభాలు తగ్గించేందుకు చూపిన సద్దుబాటు ఎంట్రీల పరిశీలన ఇప్పటికీ కొనసాగుతున్నట్టు తెలియచేసింది. విభిన్న ప్రాంతాల్లో ఈ సంస్థ అప్రకటిత స్టాక్‌లు కూడా నిర్వహిస్తున్నట్టు తేలిందని, లెక్కల్లో చూపకుండా నిర్వహిస్తున్న ఆ 814 కిలోల మొత్తం విలువ రూ.400 కోట్ల వరకు ఉంటుందని అంచనా అని వివరించింది. అలాగే ఈ గ్రూప్ నిర్వహిసున్న సిస్టమ్‌లోని డేటా ప్రకారం 2018-19 సంవత్సరంలో రూ.102 కోట్ల ఆదాయాన్ని పుస్తకాల్లో చూపకుండా దాచినట్టు తేలిందని తెలిపింది. 2019-20, 2020-21 సంవత్సరాలకు సంబంధించిన డేటాను కూడా ఫోరెన్సిక్ పరికరాల ఆధారంగా వెలుపలికి తీసే ప్రయత్నం జరుగుతున్నట్టు పేర్కొంది. గ్రూప్‌తో సంబంధం ఉన్న మరో సంస్థ వద్ద ఉన్న 50 కిలోల స్టాక్‌ను కూడా స్వాధీనం చేసుకోకుండానే అప్రకటిత ఆదాయం కిందకు వస్తుందా, లేదా పరిశీలిస్తున్నట్టు తెలిపింది.