ఆర్థిక సూచీలకు ఐఎ్‌సబీ పోర్టల్‌

ABN , First Publish Date - 2020-08-14T07:37:51+05:30 IST

ఆర్థిక వ్యవస్థ రికవరీని ఎప్పటికప్పడు విశ్లేషించడానికి అవసరమైన వివిధ సూచీలను (హై ఫ్రీక్వెన్సీ ఇండికేటర్లు-హెచ్‌ఎ్‌ఫఐ) పోర్టల్‌ ద్వారా ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎ్‌సబీ) అందుబాటులోకి తెచ్చింది...

ఆర్థిక సూచీలకు ఐఎ్‌సబీ పోర్టల్‌


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఆర్థిక వ్యవస్థ రికవరీని ఎప్పటికప్పడు విశ్లేషించడానికి అవసరమైన వివిధ సూచీలను (హై ఫ్రీక్వెన్సీ ఇండికేటర్లు-హెచ్‌ఎ్‌ఫఐ) పోర్టల్‌ ద్వారా ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎ్‌సబీ) అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం https://indiadataportal.com/jsi పోర్టల్‌ను ప్రారంభించింది. జంప్‌స్టార్ట్‌ఇండియా ఎట్‌ ఐఎ్‌సబీ కార్యక్రమం కింద ఈ పోర్టల్‌ను ప్రారంభించినట్లు ఐఎ్‌సబీ తెలిపింది. ఆర్థిక వ్యవస్థ తీరును సూచించే రోజు, నెలవారీ కీలకమైన సూచీలను ఈ పోర్టల్‌లో చూడవచ్చని విధాన రూపకర్తలు, జర్నలిస్టులు మొదలైన వారికి ఇది ఉపయోగపడుతుందని ఐఎ్‌సబీలోని భారతీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ పాలసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అశ్విన్‌ చాత్రే తెలిపారు.

Updated Date - 2020-08-14T07:37:51+05:30 IST