కరోనా సెస్.. కేంద్రం ముందు కొత్త ప్రతిపాదన

ABN , First Publish Date - 2020-04-27T01:22:47+05:30 IST

కరోనా దెబ్బకు భారత ఆర్థిక రంగం కుదేలైపోయింది. వ్యాపారాలు ఎక్కడికక్కడ నిలిపోయాయి. ప్రభుత్వానికి రాబడి తగ్గి ఖజాగా ఖాళీ నిండుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను తిరిగి ఎలా పట్టాలేక్కించాలనే దానిపై ఐఆర్ఎస్ అధికారులు ప్రధానీ మోదీకి కీలక సూచనలు చేసినట్టు తెలుస్తోంది.

కరోనా సెస్.. కేంద్రం ముందు కొత్త ప్రతిపాదన

న్యూఢిల్లీ: కరోనా దెబ్బకు భారత ఆర్థిక రంగం కుదేలైపోయింది. వ్యాపారాలు ఎక్కడికక్కడ నిలిపోయాయి. ప్రభుత్వానికి రాబడి తగ్గి ఖజానా నిండుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను తిరిగి ఎలా పట్టాలేక్కించాలనే దానిపై ఐఆర్ఎస్ అధికారులు ప్రధానీ మోదీకి కీలక సూచనలు చేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియాలో ఓ కథనం ప్రచురితమైంది. ఫిస్కల్ ఆప్షన్స్ అండ్ రెస్పాన్స్ టూ కోవిడ్-19 ఎపిడమిక్(ఫోర్స్) పేరిట రూపొందించిన సవివరమైన ప్రతిపాదనలను 50 మంది ఐఆర్‌ఎస్ అధికారులు ప్రధాని కార్యాలయానికి, ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపినట్టు తెలుస్తోంది. కేంద్ర పత్యక్ష పన్నుల బోర్డు వద్దకు కూడా ఈ ప్రతిపాదనలు చేరినట్టు సమాచారం. 


కోటి కంటే ఎక్కువ వార్షిక ఆదాయం ఉన్న వారిపై 40 శాతం పన్ను విధించడం, వెల్త్‌ ట్యాక్స్‌ను పునఃప్రారంభించడం, 10 లక్షల ఆదాయం ఉన్న వారిపై 4 శాతం వన్ టైమ్ కొవిడ్-19 సెస్ విధించటం వంటి ప్రతిపాదనలు ఈ నివేదికలో ఉన్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా పేద ప్రజలను ఆదుకునేందుకు ప్రతి నేలా వారికి నేరుగా రూ. 5000 చెల్లించాలని కూడా అధికారులు ప్రతిపాదించారట. ఆరోగ్య రంగంలోని కార్పొరేట్లకు, చిన్న వ్యాపారాలకు ట్యాక్స్ హాలిడే కూడా ఇవ్వాలని కూడా వారు సూచించారట. ‘ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం మరిన్ని నిధులు వెచ్చించాలి. అదే సమయంలో ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న సామాన్య పౌరుడికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆదాయం పెంచుకునే మార్గాలను ప్రభుత్వం అన్వేషించాలి’ అని అధికారులు ఆ నివేదికలో అభిప్రాయపడ్డారని సమాచారం.

Updated Date - 2020-04-27T01:22:47+05:30 IST