జీఎంఆర్‌ ఎయిర్‌పోర్టులో అంతర్జాతీయ స్కూల్‌

ABN , First Publish Date - 2020-08-11T06:12:32+05:30 IST

శంషాబాద్‌ విమానాశ్రయంలోని ఎడ్యుపోర్టులో ఇంటర్నేషనల్‌ స్కూల్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు హైదరాబాద్‌కు చెందిన సెయింట్‌ మేరీస్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీతో జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఏరోట్రోపోలిస్‌ లిమిటెడ్‌ (జీహెచ్‌ఏఎల్‌) ఒప్పందం కుదుర్చుకుంది...

జీఎంఆర్‌ ఎయిర్‌పోర్టులో అంతర్జాతీయ స్కూల్‌

శంషాబాద్‌ విమానాశ్రయంలోని ఎడ్యుపోర్టులో ఇంటర్నేషనల్‌ స్కూల్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు హైదరాబాద్‌కు చెందిన సెయింట్‌ మేరీస్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీతో జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఏరోట్రోపోలిస్‌ లిమిటెడ్‌ (జీహెచ్‌ఏఎల్‌) ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు అనుగుణంగా శాంటా మారియా ఇంటర్నేషనల్‌ స్కూల్‌ను ఏర్పాటు చేస్తారు. ఎడ్యుపోర్టు 100 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇప్పటికే ఎడ్యుపోర్టులో షులిక్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌, చిన్మయ విద్యాలయ, జీఎంఆర్‌ ఏవియేషన్‌ అకాడమీ, ఫ్లైట్‌ సిమ్యులేషన్‌ టెక్నిక్‌ సెంటర్‌, సీఎ్‌ఫఎం సౌత్‌ ఏషియా ట్రెనింగ్‌ సెంటర్‌ మొదలైనవి ఉన్నాయి. 


Updated Date - 2020-08-11T06:12:32+05:30 IST