ఇక బీమా కంపెనీల డిస్కౌంట్‌ కూపన్లు ఐఆర్‌డీఏఐ అనుమతి

ABN , First Publish Date - 2020-09-05T06:21:35+05:30 IST

బీమా కంపెనీలు ఇక నుం చి తమ పాలసీదారులకు ప్రోత్సాహకంగా హెల్త్‌ సప్లిమెంట్ల కొనుగోలు, యోగా సెంటర్ల

ఇక బీమా కంపెనీల డిస్కౌంట్‌ కూపన్లు ఐఆర్‌డీఏఐ అనుమతి

న్యూఢిల్లీ: బీమా కంపెనీలు ఇక నుం చి తమ పాలసీదారులకు ప్రోత్సాహకంగా హెల్త్‌ సప్లిమెంట్ల కొనుగోలు, యోగా సెంటర్ల సభ్యత్వం తీసుకునే సమయంలో ఉపయోగించుకునేలా డిస్కౌంట్‌ కూపన్లు, వోచర్లు ఇవ్వవచ్చు. ఐఆర్‌డీఏఐ ఈ మేరకు తాజా మార్గదర్శకాలు జారీ చేసింది.


పాలసీదారుల ఆరోగ్యం మెరుగుపడేలా చూడడమే లక్ష్యంగా పాలసీల్లో వెల్‌నెస్‌, రోగ నివారణ కార్యకలాపాలను ప్రవేశపెట్టేందుకు వీలుగా కూపన్లకు అనుమతి ఇచ్చినట్టు ఐఆర్‌డీఏఐ తెలిపింది. అయితే సంబంధిత పాలసీ అనుమతి మార్గదర్శకాల ప్రకారం పాలసీ పత్రంలో వాటిని పొందుపరిస్తే తప్ప జారీ చేయడానికి వీలులేదని స్పష్టం చేసింది. 


Updated Date - 2020-09-05T06:21:35+05:30 IST