జపాన్‌లో టైగర్ రొయ్యలపై తనిఖీలు రద్దు
ABN , First Publish Date - 2020-12-10T06:44:39+05:30 IST
భారత్ నుంచి దిగమతయ్యే టైగర్ రొయ్యలపై తనిఖీలను జపాన్ పూర్తిగా ఎత్తివేసింది. దీంతో రొయ్యల ఎగుమతిదారులకు పెద్ద

కోచి: భారత్ నుంచి దిగమతయ్యే టైగర్ రొయ్యలపై తనిఖీలను జపాన్ పూర్తిగా ఎత్తివేసింది. దీంతో రొయ్యల ఎగుమతిదారులకు పెద్ద ఊరట లభించింది. మన దేశం నుంచి ఎగుమతైన కొన్ని టైగర్ రొయ్యల్లో ‘ఫురాజోలిడాన్’ అనే క్రిమి సంహారక మందు అవశేషాలు కనిపించాయి. దాంతో జపాన్ గత ఏడాది నుంచి తమ దేశానికి దిగుమతయ్యే ఈ రొయ్యల కంటైయినర్లను కూలంకషంగా తనిఖీ చేస్తోంది.
గతంలో ప్రతి కంటెయినర్‌ను తనిఖీ చేసిన జపాన్ ఈ ఏడా ది మార్చి నుంచి దీన్ని 30 శాతానికి కుదించింది. ఏప్రిల్ తర్వాత ఎలాంటి క్రిమిసంహారక మందు అవశేషాలు కనిపించకపోవడంతో తనిఖీలను పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయించింది.