టయోటా కొత్త ఇన్నోవా క్రిస్టా

ABN , First Publish Date - 2020-11-25T06:39:31+05:30 IST

టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ (టీకేఎం) మార్కెట్లోకి అప్‌డేటెడ్‌ వెర్షన్‌ ఇన్నోవా క్రిస్టా విడుదల చేసింది. ఈ మల్టీపర్పస్‌ వెహికల్‌ (ఎంపీవీ) ధరలు రూ.16.26- 24.33 లక్షల (ఎక్స్‌షోరూమ్‌) మధ్యన ఉన్నాయి. ఎక్స్‌టీరియర్‌ డిజైన్‌లో మార్పులతో పాటు మరిన్ని సేఫ్టీ ఫీచర్లతో కొత్త క్రిస్టాను...

టయోటా కొత్త ఇన్నోవా క్రిస్టా

టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ (టీకేఎం) మార్కెట్లోకి అప్‌డేటెడ్‌ వెర్షన్‌ ఇన్నోవా క్రిస్టా విడుదల చేసింది. ఈ మల్టీపర్పస్‌ వెహికల్‌ (ఎంపీవీ) ధరలు రూ.16.26- 24.33 లక్షల (ఎక్స్‌షోరూమ్‌) మధ్యన ఉన్నాయి. ఎక్స్‌టీరియర్‌ డిజైన్‌లో మార్పులతో పాటు మరిన్ని సేఫ్టీ ఫీచర్లతో కొత్త క్రిస్టాను తీసుకువచ్చినట్లు తెలిపింది. పదిహేనేళ్ల క్రితం భారత మార్కెట్లోకి ఇన్నోవాను తీసుకువచ్చినప్పటి నుంచి మంచి స్పందన లభిస్తోందని టీకేఎం పేర్కొంది.  వినియోగదారులకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో వాహనాన్ని అందుబాటులోకి తీసుకువచ్చే ఉద్దేశంతో అప్‌డేటెడ్‌ వెర్షన్‌ను విడుదల చేసినట్లు టీకేఎం సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ నవీన్‌ సోని తెలిపారు. ఇప్పటి వరకు భారత మార్కెట్లో 8.8 లక్షల ఇన్నోవాలను విక్రయించినట్లు చెప్పారు.

Read more