మార్కెట్లోకి కొత్త ఇన్నోవా క్రిస్టా ఫేస్‌లిఫ్ట్... రూ. లక్షకే బుకింగ్...
ABN , First Publish Date - 2020-11-16T01:49:34+05:30 IST
టయోటా సంస్థ నుంచి అక్టోబరులో ‘ఇన్నోవా క్రిస్టా ఫేస్‌లిఫ్ట్’ డిజైన్ ను మార్కెట్లో ఆవిష్కరించింది. అయితే... ఈ కారు డెలివరీని మాత్రం డిసెంబర్ 2020 నుండి ప్రభించనుంది. కారును సెలక్టెడ్ డీలరు వద్ద రూ. లక్షకే బుక్ చేసుకోవచ్చు. ఈ టయోటా కారులో, గ్లోస్-బ్లాక్ ఫ్రంట్ గ్రిల్‌తో క్రోమ్ సరౌండ్ ఫ్లాష్ ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్‌ను ప్రత్యేక ఫీచర్లుగా కంపెనీ అందించనుంది. కాగా...
బెంగళూరు : టయోటా సంస్థ నుంచి అక్టోబరులో ‘ఇన్నోవా క్రిస్టా ఫేస్‌లిఫ్ట్’ డిజైన్ ను మార్కెట్లో ఆవిష్కరించింది. అయితే... ఈ కారు డెలివరీని మాత్రం డిసెంబర్ 2020 నుండి ప్రభించనుంది. కారును సెలక్టెడ్ డీలరు వద్ద రూ. లక్షకే బుక్ చేసుకోవచ్చు. ఈ టయోటా కారులో, గ్లోస్-బ్లాక్ ఫ్రంట్ గ్రిల్‌తో క్రోమ్ సరౌండ్ ఫ్లాష్ ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్‌ను ప్రత్యేక ఫీచర్లుగా కంపెనీ అందించనుంది. కాగా... ముందు బంపర్‌పై పలు మార్పులతో పాటు ఎల్ఇడి ఫాగ్ లాంప్స్‌ను కొత్త మోడల్ లో సవరించారు. ఇతర ఎక్స్టర్నల్ మార్పుల్లో భాగంగా కొత్త డ్యూయల్-టోన్ 16-అంగుళాల చక్రాలు, ఎల్ఈడీ ల్యాంపులను జోడించారు.
ఇక కారు లోపల 9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌తో అందించారు. ఇందులో ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సిస్టమ్‌ను పొందుపరచారు. కొత్త ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, ఆల్-బ్లాక్ ఇంటీరియర్, ఆరు సీట్ల లేఅవుట్ అందుబాటులో ఉంటుంది. ఆరు సీట్ల మోడల్లో రెండవ వరుసలో రెండు కెప్టెన్ సీట్లు ఉండగా, 7 సీట్ల మోడల్‌కు రెండవ వరుసలో బెంచ్ సీటు ఏర్పాటు చేశారు. దీనికి బ్లాక్ కలర్ కెప్టెన్ సీట్లు, ఇంటిగ్రేటెడ్ ఎయిర్ ప్యూరిఫైయర్, సీట్ టేబుల్, వెనుక ప్యాసింజర్ ఎంటర్టైన్మెంట్ తో కొత్త అప్ హోల్ స్టరీ లభిస్తోంది.
క్రిస్టా ఫేస్‌లిఫ్ట్ ఢిల్లీ ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ. 15.66 లక్షలు. అదే సమయంలో... దాని టాప్ మోడల్ రూ. 23.63 లక్షలుగా ఉంది.