సరికొత్త శిఖరాలకు సూచీలు

ABN , First Publish Date - 2020-12-15T06:51:58+05:30 IST

స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు సరికొత్త శిఖరాగ్రాలకు చేరుకున్నాయి. సానుకూల స్థూల ఆర్థికాంశాలతో ట్రేడర్లు ఇంధనం, ఇన్‌ఫ్రా, బ్యాంకింగ్‌ షేర్లలో కొనుగోళ్లు పెంచడం ఇందుకు దోహదపడింది.

సరికొత్త శిఖరాలకు సూచీలు

 154 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్‌ 

ముంబై: స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు సరికొత్త శిఖరాగ్రాలకు చేరుకున్నాయి. సానుకూల స్థూల ఆర్థికాంశాలతో ట్రేడర్లు ఇంధనం, ఇన్‌ఫ్రా, బ్యాంకింగ్‌ షేర్లలో కొనుగోళ్లు పెంచడం ఇందుకు దోహదపడింది. సోమవారం నాడు బీఎ్‌సఈ సెన్సెక్స్‌ 154.45 పాయింట్లు లాభపడి 46,253.46 వద్ద ఆల్‌టైం రికార్డు ముగింపును నమోదు చేసుకుంది. 46,373.34 వద్ద సరికొత్త జీవితకాల ఇంట్రాడే గరిష్ఠం కూడా నమోదైంది. ఎన్‌ఎ స్‌ఈ నిఫ్టీ విషయానికొస్తే.. 13,597.50 వద్ద సరికొత్త ఇంట్రాడే రికార్డును సృష్టించింది. చివరికి 44.30 పాయింట్ల పెరుగుదలతో 13,558.15 వద్ద రికార్డు ముగింపు నమోదు చేసుకుంది. సెన్సెక్స్‌ లిస్టెడ్‌ కంపెనీల్లో 4.91 శాతం బలపడిన ఓఎన్‌జీసీ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. అన్నిటికంటే అత్యధికంగా మహీంద్రా అండ్‌ మహీంద్రా షేరు 1.98 శాతం నష్టపోయింది.

  

నేడే మిస్టర్స్‌ బెక్టర్స్‌ ఫుడ్‌ పబ్లిక్‌ ఇష్యూ: బిస్కెట్లు,బన్‌ తయారీ సంస్థ మిస్టర్స్‌ బెక్టర్స్‌ ఫుడ్‌ స్పెషాలిటీస్‌ ఐపీఓ మంగళవారం నాడు ప్రారంభమై బుధవారం ముగియనుంది. పబ్లిక్‌ ఇష్యూ ధర శ్రేణిని సంస్థ రూ.286-288గా నిర్ణయించింది. ఐపీఓలో భాగంగా రూ.40.54 కోట్ల తాజా ఈక్విటీని జారీ చేయడంతోపాటు రూ.500 కోట్ల షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎ్‌ఫఎస్‌) పద్ధతిన విక్రయించనుంది. 


ఐపీఓకు ఎంటీఏఆర్‌ టెక్నాలజీస్‌: హైదరాబాద్‌కు చెందిన ప్రెసిషన్‌ ఇంజనీరింగ్‌ కంపెనీ ఎంటీఏఆర్‌ టెక్నాలజీస్‌ పబ్లిక్‌ ఇష్యూకు వచ్చే ప్రయత్నాల్లో ఉంది. క్యాపిటల్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీకి త్వరలోనే దరఖాస్తు సమర్పించనుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 1970లో స్థాపించిన ఎంటీఏఆర్‌.. ఐపీఓ ద్వారా రూ.600-650 కోట్ల మేర నిధులు సమీకరించనున్నట్లు సమాచారం. 


17 నుంచి ఎన్‌ఎండీసీ షేర్‌ బైబ్యాక్‌ : ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌ఎండీసీ.. రూ.1.378 కోట్లతో షేర్‌ బైబ్యాక్‌ చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 17న ప్రారంభం కానున్న ఈ బైబ్యాక్‌ ఆఫర్‌ 31న ముగియనుందని వెల్లడించింది. రూ.1,378 కోట్లతో బైబ్యాక్‌ చేపట్టేందుకు కంపెనీ బోర్డు గత వారం ఆమోదం తెలిపింది. ఆఫర్‌లో భాగంగా ఒక్కో షేరును రూ.105 ధరతో బైబ్యాక్‌ చేయనున్నట్లు పేర్కొంది. రూపాయి ముఖ విలువతో కూడిన 13,12,43,809 షేర్లను బైబ్యాక్‌ చేయనుంది. 


బర్గర్‌ కింగ్‌ బంపర్‌ లిస్టింగ్‌

స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ల్లో సోమవారం లిస్ట్‌ అయిన బర్గర్‌ కింగ్‌ ఇండియా షేర్లకు ట్రేడర్ల నుంచి అపూర్వ స్పందన లభించింది. పబ్లిక్‌ ఇష్యూ ధర రూ.60తో పోలిస్తే తొలిరోజే బీఎ్‌సఈలో 131 శాతం మేర ఎగబాకి రూ.138.40 వద్దకు చేరుకుంది. ఎన్‌ఎ్‌సఈలో 125 శాతం వృద్ధితో రూ.135 వద్ద ముగిసింది. బీఎ్‌సఈలో కంపెనీకి చెందిన 191.55 లక్షల షేర్లు ట్రేడవగా.. ఎన్‌ఎ్‌సఈలో 18.67 కోట్ల షేర్లు చేతులు మారాయి. బర్గర్‌ కింగ్‌ తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ)కూ అనూహ్య స్పందన లభించింది. పబ్లిక్‌ ఇష్యూ సైజుతో పోలిస్తే 156.65 రెట్ల బిడ్లు వచ్చాయి. 

Updated Date - 2020-12-15T06:51:58+05:30 IST