2020-21లో భారత ఆర్థిక వ్యవస్థ భారీ పతనం: ఏడీబీ అంచనా
ABN , First Publish Date - 2020-06-18T23:40:08+05:30 IST
కరోనా కల్లోలం కారణంగా 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 4 శాతం వరకు క్షీణించే..
న్యూఢిల్లీ: కరోనా కల్లోలం కారణంగా 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 4 శాతానికి క్షీణించే అవకాశాలు ఉన్నాయని ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) తన అంచనా వేసింది. తన వార్షిక నివేదిక ఏషియన్ డెవలప్‌మెంట్ అవుట్‌లుక్(ఏడీవో)లో ఏడీబీ ఈ మేరకు పేర్కొంది. ‘డెవలపింగ్ ఏషియా’ దేశాల్లో కూడా 2020 ఏడాది ఆర్థికవృద్ధి అంతంత మాత్రంగానే ఉంటుందని ఏడీబీ పేర్కొంది. ఆసియా- పసిఫిక్ ప్రాంతంలోని ‘డెవలపింగ్ ఏషియా’లో మొత్తం 45 దేశాలు ఉన్నాయి. ఈ దేశాల్లో 2020 సంవత్సరంలో వృద్ధి 0.1 శాతంగా మాత్రమే ఉండొచ్చనీ.. 1961 తర్వాత ఈ స్థాయిలో మందగించడం ఇదే తొలిసారి అవుతుందని ఏడీబీ పేర్కొంది. కాగా 2021లో మాత్రం ఈ ప్రాంతంలో అత్యధిక స్థాయిలో 6.2 శాతం వరకు వృద్ధి నమోదవుతుందని ఏడీబీ అంచనా వేసింది.