ఐదేళ్ళలో బ్రిటన్ ను, పదేళ్ళలో జపాన్ ను దాటనున్న భారత ఆర్ధిక వ్యవస్థ...

ABN , First Publish Date - 2020-12-28T01:20:21+05:30 IST

భారత ఆర్థిక వ్యవస్థ ఈ దశాబ్దకాలంలో మరెంతో ముందుకెళుతుందని సెంటర్ ఫర్ ఎకనమిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చ్ (సీఈబీఆర్) తన వార్షిక నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఆరవ స్థానంలో ఉన్న భారత్... 2025 నాటికి బ్రిటన్‌ను అధిగమించి అయిదో స్థానానికి, అటుపై 2030 నాటికి జపాన్‌ను అధిగమించి మూడో స్థానానికి చేరుకోవచ్చునని వెల్లడించింది.

ఐదేళ్ళలో బ్రిటన్ ను, పదేళ్ళలో జపాన్ ను దాటనున్న భారత ఆర్ధిక వ్యవస్థ...

ముంబై :  భారత ఆర్థిక వ్యవస్థ ఈ దశాబ్దకాలంలో మరెంతో ముందుకెళుతుందని సెంటర్ ఫర్ ఎకనమిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చ్ (సీఈబీఆర్) తన వార్షిక నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఆరవ స్థానంలో ఉన్న భారత్... 2025 నాటికి బ్రిటన్‌ను అధిగమించి అయిదో స్థానానికి, అటుపై 2030 నాటికి జపాన్‌ను అధిగమించి మూడో స్థానానికి చేరుకోవచ్చునని వెల్లడించింది. అంతేకాదు... అంతకన్నా కొంచెం ముందుగానే... అంటే... 2027 నాటికి జర్మనీని అధిగమిస్తుందని పేర్కొంది. కరోనా కారణంగా భారత్ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందని, అందుకే తన స్థానాన్ని బ్రిటన్‌కు కోల్పోయిందని, 2024 నాటికి అదే స్థానంలో ఉండి, 2025 నాటికి ఆ దేశాన్ని భారత్ అధిగమించగలదని వివరించింది. 

కారణమిదే...

బలహీనపడిన రూపాయి కారణంగా బ్రిటన్ ఈ ఏడాది తిరిగి తన స్థానాన్ని భారత్ నుండి తీసుకోగలిగిందని సీఈబీఆర్ నివేదిక తెలిపింది. భారత ఆర్థిక వ్యవస్థ 2021 లో 9 శాతం, 2022లో 7 శాతం మేర నమోదు చేయవచ్చునని అంచనా వేసింది. ఆర్థికంగా మరింత అభివృద్ధి సాధించినప్పుడు సాధారణంగా వృద్ధి మందగిస్తుందని, 20.35 లో భారత వార్షిక వృద్ధి రేటు 5.8 శాతానికి తగ్గవచ్చునని పేర్కొంది. 

కాస్త ఊరట... 

కరోనా భారత్‌లో మానవ, ఆర్థిక నష్టాలను మిగిల్చిందని, అయితే... అమెరికా, ఐరోపాలతో పోలిస్తే మరణాలు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయని, ఇది కాస్త ఊరటనిచ్చే అంశమని వెల్లడించింది. లాక్‌డౌన్‌ను క్రమంగా ఎత్తివేశాక ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాలు తిరిగి పుంచుకున్నాయని, ఉత్పత్తి మాత్రం కరోనా కంటే ముందుస్థాయితో పోలిస్తే తక్కువగా ఉందని తెలిపింది. వ్యవసాయ రంగం ముందుకు నడిపిస్తోందని వెల్లడించింది. 


అమెరికాను దాటనున్న చైనా...

కాగా... 2028 లో అమెరికాను వెనక్కు నెట్టి చైనా ప్రపంచలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే అవకాశాలున్నాయని తెలిపింది. గత అంచనాతో పోలిస్తే ఐదేళ్లు ముందుగానే ఇది జరుగుతోందని వెల్లడించింది. కరోనా సంక్షోభం నుంచి కోలుకునే విషయంలో రెండు దేశాల మధ్య అసమానతలే ఇందుకు కారణమని వెల్లడించింది. మరో పది సంవత్సరాలు... జపాన్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగనుందని వెల్లడించింది.

Updated Date - 2020-12-28T01:20:21+05:30 IST