ఈ ఏడాది అత్యధిక విదేశీ పెట్టుబడులు పెట్టిన భారతీయ కంపెనీలు...

ABN , First Publish Date - 2020-12-25T22:49:20+05:30 IST

భారత్ కు చెందిన పారిశ్రామిక దిగ్గజాలు విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. కరోనా కారణంగా ఈ(2020) సంవత్సరం లో భారతదేశం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పటికీ ఈ ఏడాది మొదటి ఎనిమిది నెలల్లో భారతీయ సంస్థలు విదేశాలలో 12.25 బిలియన్ డాలర్ల మేరకు పెట్టుబడులు పెట్టాయి.

ఈ ఏడాది అత్యధిక విదేశీ పెట్టుబడులు పెట్టిన భారతీయ కంపెనీలు...

న్యూఢిల్లీ : భారత్ కు చెందిన పారిశ్రామిక దిగ్గజాలు విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. కరోనా కారణంగా ఈ(2020) సంవత్సరం లో భారతదేశం  తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పటికీ ఈ ఏడాది మొదటి ఎనిమిది నెలల్లో భారతీయ సంస్థలు విదేశాలలో 12.25 బిలియన్ డాలర్ల మేరకు పెట్టుబడులు  పెట్టాయి. 


ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో... సింగపూర్, అమెరికా, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, నెదర్లాండ్స్, మారిషస్ తదితర దేశాల్లో భారతీయ కంపెనీలు పెట్టుబడి పెట్టాయి. జెఎస్‌డబ్ల్యు స్టీల్, ఒఎన్‌జీసీ విదేష్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, హల్దియా పెట్రోకెమికల్స్, మహీంద్రా & మహీంద్రా తదితర కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. అదానీ ప్రాపర్టీస్, పిరమల్ ఎంటర్ప్రైజెస్, లుపిన్, కాడిలా హెల్త్‌కేర్, టాటా స్టీల్ మరియు ఇన్ఫోసిస్ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచిన సంస్థలుగా ఉన్నాయి.


Updated Date - 2020-12-25T22:49:20+05:30 IST