భారీ నష్టాలతో ముగిసిన భారత స్టాక్ మార్కెట్లు..
ABN , First Publish Date - 2020-08-20T22:14:14+05:30 IST
భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ వరుసగా మూడోరోజు నష్టాలతో ముగిశాయి. బ్యాంకులు, ఫైనాన్షియల్...

ముంబై: భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ వరుసగా మూడోరోజు నష్టాలతో ముగిశాయి. బ్యాంకులు, ఫైనాన్షియల్ స్టాక్‌లు నష్టాలను నమోదు చేయడంతో పాటు.. అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకాలు పోటెత్తడంతో సెన్సెక్స్ 400 పాయింట్ల మేర నష్టపోయింది. ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 394.40 పాయింట్లు (1.02శాతం) నష్టపోయి 38,220.39 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 96.20 పాయింట్లు (0.84 శాతం) క్షీణించి 11,312.20 వద్ద క్లోజ్ అయ్యింది. హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, భారతీ ఎయిర్‌టెల్ తదితర షేర్లు నష్టాలను నమోదు చేసిన వాటిలో ఉన్నాయి. ఇక ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, పవర్ గ్రిడ్, టాటా స్టీల్, హెచ్‌సీఎల్ టెక్ తదితర షేర్లు లాభాల్లో ఉన్నాయి.