కారు కొంటే రూ. 2.5 లక్షల తగ్గింపు..!
ABN , First Publish Date - 2020-12-04T00:45:20+05:30 IST
ఈ కారు కొంటే రూ. 2.5 లక్షల వరకు తగ్గింపును సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు... ఇతరత్రా ప్రయోనాలను కూడా పొందవచ్చు. మరోవైపు... ఓటిటి సబ్స్క్రిప్షన్లతో పాటు ఎయిర్టెల్ సెటప్ బాక్స్ కూడా ఉచితంగానే సొంతమవుతాయి. వివరాలిలా ఉన్నాయి.
ముంబై : ఈ కారు కొంటే రూ. 2.5 లక్షల వరకు తగ్గింపును సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు... ఇతరత్రా ప్రయోనాలను కూడా పొందవచ్చు. మరోవైపు... ఓటిటి సబ్స్క్రిప్షన్లతో పాటు ఎయిర్టెల్ సెటప్ బాక్స్ కూడా ఉచితంగానే సొంతమవుతాయి. వివరాలిలా ఉన్నాయి.
కార్ల కొనుగోలుపై ప్రస్తుతం భారీ ఆఫర్లే అందుబాటులో ఉన్నాయి. భారీ తగ్గింపు ప్రయోజనాలను పొందొచ్చు. కంపెనీలు ఇప్పుడు ఇయర్ ఎండ్ డిస్కౌంట్ సేల్‌ను ప్రకటిస్తున్నాయి.
ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హోండా కార్స్ తాజాగా తన బీఎస్ 6 కార్లపై భారీ ఆఫర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. హోండా అమేజ్ స్పెషల్ ఎడిషన్ కారుపై రూ. 15 వేల వరకు తగ్గింపు ప్రయోజనాలనందిస్తోంది. హోండా అమేజ్ ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్‌పై రూ. 27 వేల తగ్గింపుతోపాటు ఇతరత్రా ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉన్నాయి.
హోండా జాజ్ కారుపై రూ. 40 వేలు, సిటీ 5 వ జనరేషన్ కారుపై రూ. 30 వేల వరకు తగ్గింపు ప్రయోజనాలున్నాయి. హోండా డబ్ల్యూఆర్వీ కారుపై రూ. 40 వేల వరకు తగ్గింపు ప్రయోజనాలున్నాయి. ఇక హోండా సివిక్ కారుపై రూ. 2.5 లక్షల వరకు తగ్గింపు ప్రయోజనాలను పొందొచ్చు. ఇకపోతే తగ్గింపు ప్రయోజనాల్లో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ బోనస్, అడిషనల్ డిస్కౌంట్ వంటివి అన్నీ కలిసి ఉంటాయి.