ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ నుంచి గ్యారంటీడ్‌ పెన్షన్‌ ప్లాన్‌

ABN , First Publish Date - 2020-12-20T06:45:50+05:30 IST

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌...ఐసీఐసీఐ ప్రు గ్యారంటీడ్‌ పెన్షన్‌ ప్లాన్‌ను తీసుకువచ్చింది. పదవీ విరమణ అనంతరం గ్యారంటీగా ఆదాయం అందించే విధంగా ఈ పెన్షన్‌ ప్లాన్‌ను తీర్చిదిద్దినట్లు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ వెల్లడించింది...

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ నుంచి గ్యారంటీడ్‌ పెన్షన్‌ ప్లాన్‌

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌...ఐసీఐసీఐ ప్రు గ్యారంటీడ్‌ పెన్షన్‌ ప్లాన్‌ను తీసుకువచ్చింది. పదవీ విరమణ అనంతరం గ్యారంటీగా ఆదాయం అందించే విధంగా ఈ పెన్షన్‌ ప్లాన్‌ను తీర్చిదిద్దినట్లు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ వెల్లడించింది. నాన్‌ పార్టిసిపెంట్‌ ఇండివిడ్యువల్‌ యాన్యుటీ ప్రొడక్ట్‌ అయిన ఈ ప్లాన్‌ను వినియోగదారులు తమ వెసులుబాటుకు తగ్గట్టుగా సత్వర, డెఫర్డ్‌ యాన్యుటీగా ఎంపిక చేసుకునే వీలుంది. ఇందులో సత్వర (ఇమ్మీడియట్‌) యాన్యుటీ ఆప్షన్‌లో వన్‌టైమ్‌ ప్రీమియం చెల్లించటం ద్వారా రెగ్యులర్‌ ఆదాయాన్ని అందుకునే వీలుంటుంది.


డెఫర్డ్‌ యాన్యుటీలో వినియోగదారులు తమ అవసరాలకు తగ్గట్టుగా ఆదాయాన్ని ఎంపిక చేసుకునే వీలుంది. అవసరమైతే పదేళ్ల పాటు ఆదాయాన్ని వాయిదా వేసుకునే అవకాశాన్ని ఈ ప్లాన్‌ కల్పిస్తోంది. పదవీ విరమణ అనంతరం ఆర్థికంగా నిలదొక్కుకునే విధంగా ఈ ప్లాన్‌ను తీర్చిదిద్దింది. ఒకవేళ తీవ్ర అనారోగ్యానికి గురయితే ప్రీమియంను వెనక్కు తీసుకునే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా వార్షిక చెల్లింపులను పెంచుకునే వెసులుబాటును  కల్పిస్తోంది. 

Updated Date - 2020-12-20T06:45:50+05:30 IST