పండుగ సేల్స్‌పై మరో గుడ్‌న్యూస్ చెప్పిన అమెజాన్

ABN , First Publish Date - 2020-10-21T23:18:52+05:30 IST

దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో.. ఇయర్ ఎండ్ సేల్‌లో భాగంగా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ పేరుతో అమ్మకాలు నిర్వహిస్తున్న ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ వినియోగదారులకు...

పండుగ సేల్స్‌పై మరో గుడ్‌న్యూస్ చెప్పిన అమెజాన్

దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో.. ఇయర్ ఎండ్ సేల్‌లో భాగంగా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ పేరుతో అమ్మకాలు నిర్వహిస్తున్న ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ వినియోగదారులకు మరో శుభవార్త చెప్పింది. ఈ సేల్‌లో భాగంగా ఇప్పటివరకూ హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్, క్రెడిట్ కార్డులపై మాత్రమే తక్షణ డిస్కౌంట్‌ను ప్రకటించిన అమెజాన్ తాజాగా ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాదారులకు కూడా ఈ అవకాశాన్ని కల్పించింది. అక్టోబర్ 28తో ముగియనున్న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా.. అక్టోబర్ 24 నుంచి ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాదారులకు కూడా రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 24 నుంచి 28 వరకూ హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్, క్రెడిట్ కార్డులతో పాటు ఐసీఐసీఐ డెబిట్, క్రెడిట్ కార్డులపై కూడా 10 శాతం రాయితీని ఇవ్వనున్నట్లు అమెజాన్ ప్రకటించింది. ఇదిలా ఉంటే.. మరో ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌కు ఇవాళే చివరి రోజు కావడం గమనార్హం.

Updated Date - 2020-10-21T23:18:52+05:30 IST