సరికొత్త టక్సన్ ప్రీమియం ఎస్‌యూవీని లాంచ్ చేసిన హ్యుందయ్

ABN , First Publish Date - 2020-07-14T22:24:08+05:30 IST

హ్యుందయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ మంగళవారం రూ. 22.30-27.03 లక్షల ధర శ్రేణిలో తన సరికొత్త టక్సన్

సరికొత్త టక్సన్ ప్రీమియం ఎస్‌యూవీని లాంచ్ చేసిన హ్యుందయ్

న్యూఢిల్లీ: హ్యుందయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ మంగళవారం రూ. 22.30-27.03 లక్షల ధర శ్రేణిలో తన సరికొత్త టక్సన్ ప్రీమియం ఎస్‌యూవీని విడుదల చేసింది. కొత్త మోడల్ పెట్రోల్, డీజిల్ వేరియంట్‌లలో 2-లీటర్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. దేశీయ మార్కెట్లో స్పోర్ట్ యుటిలిటీ వాహనాల తయారీదారుగా సంస్థ తన స్థానాన్ని పదిలం చేసుకోవడానికి ఇది సాయపడే అవకాశం ఉంది. హ్యుందయ్ ఎస్‌యూవీ పోర్ట్ ఫోలియోలో వెన్యూ (కాంపాక్ట్ ఎస్‌యూవీ), క్రెటా (మిడ్ సైజ్ ఎస్‌యూవీ) తర్వాత తాజాగా టక్సన్ చేరింది. ఫిబ్రవరిలో నిర్వహించిన ఆటో ఎక్స్‌పోలో దీనిని తొలిసారి ప్రదర్శించింది. 

Updated Date - 2020-07-14T22:24:08+05:30 IST