హ్యుండయ్ ఈఎంఐ అష్యూరెన్స్ ఆఫర్
ABN , First Publish Date - 2020-05-09T05:39:00+05:30 IST
హ్యుండయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్‌ఎంఐఎల్).. ఆటోమొబైల్ పరిశ్రమలో మొట్టమొదటిసారిగా
హైదరాబాద్: హ్యుండయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్‌ఎంఐఎల్).. ఆటోమొబైల్ పరిశ్రమలో మొట్టమొదటిసారిగా ‘హ్యుండయ్ ఈఎంఐ అష్యూరెన్స్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఎంపిక చేసిన కొన్ని మోడళ్లపై ఈ ఆఫర్‌ను అందించనున్నట్లు తెలిపింది. ఈ నెలలో కారు కొనుగోలు చేసే కస్టమర్లకు వచ్చే ఏడాది కాలంలో (మొదటి 3 నెలలు మినహాయించి) మూడు కార్ లోన్ ఈఎంఐలకు ఈ కార్యక్రమం కింద కవరేజీ కల్పించనుంది. తాను పనిచేస్తున్న కంపెనీ ఆర్థికంగా దివాలా తీయడం లేదా, ఇతర సంస్థలో విలీనం కావడం తదితర కారణాల వల్ల ఉద్యోగం కోల్పోయినప్పుడు కస్టమర్‌కు ఈ కవరేజీ వర్తిస్తుందని హ్యుండయ్ తెలిపింది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో కారు కొనుగోలు చేయాలనుకుంటున్న వారిని దృష్టిలో పెట్టుకుని హ్యుండయ్ తొలిసారిగా ఈఎంఐ అష్యూరెన్స్ కార్యక్రమాన్ని తీసుకువచ్చిందని హెచ్‌ఎంఐఎల్ డైరెక్టర్ (సేల్స్, మార్కెటింగ్) తరుణ్ గార్గ్ తెలిపారు.
హైదరాబాద్ కేంద్రంగా పని చేసే లారస్ ల్యాబ్స్‌లో రూ.613 కోట్ల విలువైన 138.3 లక్షల షేర్లను ఎయిట్ రోడ్స్ మేనేజ్‌మెంట్ మారిషస్, బ్లూవాటర్ ఇన్వెస్ట్‌మెంట్ లిమిటెడ్ విక్రయించాయి. ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా ఈ షేర్లను విక్రయించాయి. ఈ ఏడాది మార్చి నాటికి లారస్ ఈక్విటీలో ఈ రెండు సంస్థలకు 2.71 కోట్ల (25.36 శాతం) షేర్లు ఉన్నాయి. లారస్ ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలు ప్రకటించినా ఈ రెండు సంస్థలు తమ వాటాలో దాదాపు సగం వాటాను విక్రయించడం విశేషం.